కేసీఆర్ చేస్తున్నది డ్రామ కాదా

సమాధానం చెప్పండి హరీష్ రావు గారూ

కాంగ్రెస్ నేత జి.నిరంజన్ 

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

వీల్ చైర్ తో ఈటెల ఎన్నికల డ్రామా మాట సరే, దళిత బంధు పథకం పేరుతో కె.సి.ఆర్ చేస్తున్న డ్రామా మాటేమిటి అని మంత్రి హరీష్ రావుకు తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మాజీ మంత్రి ఈటెల మోకాలికి శస్త్ర చికిత్స పై స్పందిస్తూ ఇక వీల్ చైర్ తో ఎన్నికల ప్రచార డ్రామా చేస్తారని విమర్శించిన మంత్రి హరీశ్ రావు , సి.ఎమ్ కె.సి.ఆర్ ప్రకటించిన దళిత బంధు పథకము, హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న డ్రామా కాదా ? స్పష్టం చేయాలి. రైతుబందు ప్రారంభించిన చోటే దళిత బందు ప్రారంభించాలని ఎక్కడైనా నియమముందా ? ఈ నెల 16 న అక్కడే ప్రారంబించాలనుకోవడము ఎన్నికల డ్రామా కాదా? కరోనా నిబంధనలను ప్రక్కకు పెట్టి 412 మంది హుజూరాబాద్ దళిత ప్రతినిధులతో ప్రగతి భవన్ లో సమావేశమై విందు భోజనము చేయడము ఎన్నికల డ్రామా కాదా? ఏళ్ల తరబడి టి.అర్ ఎస్ లో ఉన్న నాయకులకు ద్రోహము చేస్తూ పార్టీ లో చేరిన పది రోజులకే కౌశిక్ రెడ్డికి నామినేటడ్ ఎమ్.ఎల్.సి పదవి కట్టబెట్టడం ఎన్నికల డ్రామా కాదా? నాగర్జున సాగర్ ఎన్నికల సమయములో ఇచ్చిన హామీల అమలు పై ప్రశ్నలు వస్తుంటే నిన్న నాగార్జునసాగర్ లోని హాలియా కెళ్ళి హామీలు గుప్పించటము ఎన్నికల డ్రామా కాదా? ఇది హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన పర్యటన కాదా? ప్రజలను మోసగించడానికి ఆడే నాటకాలలో బిజెపి, టి.అర్.ఎస్ ఎవరేమి తక్కువ తినలేదు. మోడి, కె.సి.ఆర్ లు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడము లో ఆరి తేరిన వారు. గతములో కె.సి.ఆర్ పంచన ఉండి నేర్చిన విద్యలను ఇప్పుడు, ఈటెల మోడి పంచన చేరి ప్రదర్శించడములో ఆశ్చర్యము లేదు. హరీశ్ రావు ఉద్యమ సమయములో చేసిన బాసలు మర్చి తన రాజకీయ మనుగడకు కె.సి.ఆర్ తాబేదారుగా మాట్లాడుతూ తెలంగాణా ప్రజల నమ్మకాన్ని వంచన చేయడాన్ని చరిత్ర క్షమించదు. అని ఆయన హితవు పలికారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: