హాటళ్లు...బేకరి, స్వీట్ షాపుల్లో....

మునిపల్ శానటరీ అధికార్ల అకస్మిక తనిఖీలు


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

మార్కాపురం పట్టణ మునిసిపల్ కమీషనరుగారి ఆదేశానుసారం గురువారంనాడు పట్టణంలోని పలు హోటళ్ళలోను, బేకరీ, స్వీట్ షాపులలో మునిసిపల్ శానిటరీ అధికారి షేక్. నాయబ్ రసూల్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ముఖ్యంగా పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పట్టణంలోని షాపుల యజమానులకు నో మాస్క్ - నో ఎంట్రీ బోర్డులు పెట్టుకోవాలని,

 

హోటళ్లతో పాటు పలు షాపులు ఎప్పటికప్పుడు హైపో క్లోరైడ్ ద్రావణం తో శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, ప్లాస్టిక్ కవర్లు నిషేదించాలని, సామజిక దూరం పాటించాలని, పురపాలక సంఘం పరిధిలో ఉన్న షాపుల యాజమాన్యం వారు ట్రేడ్ లైసెన్సు  తీసుకోని వారు, వెంటనే తీసుకోవాలని లేని యెడల వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోబడునని తెలియజేయడమైనది. ఈ కార్యక్రమములో శానిటరీ సెక్రటరీ భాస్కర్, మునిసిపల్ , సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.







✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


 




 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: