నేడు విద్యాలయాలు జాతికి అంకితం
*ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు
*నాడు శిధిలం నేడు ఆలయం
డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్- ఖమ్మం ప్రతినిధి)
నాడు–నేడు ద్వారా సుందరీకరించిన విద్యాలయాలు నేడు జాతికి అంకితం అవుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. ఇది చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లికించబడుతుందని అన్నారాయన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ఈ మహాయజ్ఞం ద్వారా విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు అందుతాయని చెప్పారు.. ఒకప్పుడు శిధిలమైన భవనాలు, పెచ్చులూడిన గచ్చులు, విరిగిపోయిన బల్లలు, వర్షం పడితే విద్యార్థులంతా ఒక మూల కూర్చునేలా కురుస్తున్న గదులతో ప్రభుత్వ పాఠశాలలు దర్శనమిచ్చేవన్న ఏలూరి.. నేడు ఆలయాల వలె పాఠశాలల రూపురేఖలే మారిపోయాయని అన్నారు. తొలిదశలో 15 వేల పైచిలుకు పాఠశాలలు ఆధునీకరించబడ్డాయని తెలిపిన ఏలూరి.. నేడు.. నాడు నేడు రెండో దశ పనులు కూడా మొదలవుతాయని.. 2022 జూన్ నాటికి రాష్ట్రంలో మరో 16 వేల పాఠశాలల రూపురేఖలు మారుతాయని ఆయన అన్నారు.
ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడమే కాకుండా.. ఇంగ్లిష్ మీడియం, కార్పొరేట్ తరహా క్లాసు రూములతో విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాటలు వేశారని ఏలూరి కొనియాడారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇంత గొప్ప అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజల దృష్టిని ఆకర్షించారని ఏలూరి అన్నారు. నిజానికి నీతి అయోగ్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2016 – 2018 మధ్య కాలంలో దాదాపు ఐదు వేల పాఠశాలలు మూతపడితే సీఎం జగన్ నిర్ణయంతో నేడు ఆ పరిస్థితి మారి, మూత పడ్డ స్కూల్స్ కూడా తెరుచుకుంటున్నాయని ఏలూరి అన్నారు.
Home
Unlabelled
నేడు విద్యాలయాలు జాతికి అంకితం .. *ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు ... *నాడు శిధిలం నేడు ఆలయం- డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: