అరులందరికి అక్రిడిటేషన్లు మంజూరు చేయాలి

- అటాక్స్ కమిటీలను పునరుద్ధరించాలి

- అక్రిడిటేషన్ కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించాలి

- ప్రెస్ అకాడమీ చైర్మన్ను కోరిన ఎపిడబ్ల్యుజెఎఫ్ జిల్లా నేతలు 


(జానోజాగో వెబ్ న్యూస్-ఒంగోలు ప్రతినిధి)

అర్హులైన జర్నలిస్టులందరిక అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి అటాక్స్ కమిటీలను పునరుద్ధరించాలని ఎపి ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ ను ఎపిడబ్ల్యుజెఎఫ్ ప్రకాశం జిల్లా నేతలు కోరారు. ఎపి ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలుకు వచ్చారు. స్థానిక ఎన్ఎస్ పి అతిథి గృహంలో బస చేసిన ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ను ఎపిడబ్ల్యుజెఎఫ్ ప్రకాశం జిల్లా నేతలు కలసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎపిడబ్ల్యుజెఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గొట్టిపాటి నాగేశ్వరరావు, ఎస్ వి బ్రహ్మం మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికి అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. అక్రిడిటేషన్ కమిటీలలో గుర్తింపు పొందిన జర్నలిస్టు యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల పై దాడులు పెరుగుతున్నాయని, వారికి రక్షణ కల్పించేందుకు అటాక్స్ కమిటీలను పునరుద్దరించి జర్నలిస్టు యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఫిక్స్ అసెట్ ఏదైనా కల్పించాలన్నారు. అదేవిధంగా ఎపి ప్రెస్ అకాడమీ ద్వారా ప్రకాశం జిల్లాలోని జర్నలిస్టులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ మాట్లాడుతూ


అక్రిడిటేషన్ కమిటీలలో గుర్తింపు పొందిన 2 జర్నలిస్ట్ యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పించాలని ముఖ్యమంత్రికి ప్రతిపాదించామన్నారు. కరోనా తో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 5 లక్షల నగదు కాకుండా ఏదైనా స్థిరమైన ఆస్తిని కల్పించే విషయం ప్రభుత్వం పరిశీలనలో ఉందన్నారు. ఇతర సమస్యలపై ముఖ్యమంత్రి, ఉన్నత స్థాయి అధికారులతో చర్చిస్తామన్నారు. జర్నలిస్టుల నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ఎపి ప్రెస్ అకాడమీ సర్టిఫికెట్ కోర్సును ప్రవేశపెట్టిందని, దీనిని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ప్రకాశం జిల్లా జర్నలిస్టుల నైపుణ్యాభివృద్ధి పెంచేందుకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రెస్ అకాడమీని ఛైర్మన్ ను కలిసిన వారిలో ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వి.భక్తవత్సలం, ఎన్ఏజె నాయకులు వెల్ విషర్ శంకర్, ఎపిబిజెఏ జిల్లా అధ్యక్షులు ఎన్.కాశీ రావు, ఆంధ్రప్రభ బ్యూరో ఇన్ ఛార్జి శ్రీనివాస నాయక్, వార్త బ్యూరో ఇన్‌ఛార్జి షేక్ కరిముల్లా, ఎపిడబ్ల్యుజెఎఫ్ జిల్లా కోశాధికారి ఎల్.రాజు తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: