బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా....

ప్రజా సంఘాల నిరసన ప్రదర్శన

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణములో ప్రజా సంఘాల ఆధ్వర్యములో క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా “ సేవ్ ఇండియా, సేవ్ డేమోక్రసి “ రక్షించాలనికోరుతూ, అలాగే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎఐటియుసి, సిఐటియు, యంపీజే, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో నిరసన ప్రదర్శన అనంతరం కోర్టు సెంటర్ లో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎఐటియుసి నాయకులు అందే నాసరయ్య మాట్లాడుతూ  మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత  స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తున్నారని విమర్శించారు.గత 70 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా చమురు ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిపోయాయని,దీంతో ప్రజలు ముఖ్యంగా కార్మికులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని

 నాసరయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సీఐటియు పశ్చిమ ప్రకాశం అధ్యక్షుడు డీకేఎం రఫీ మాట్లాడుతూ లాభాలతో నడుస్తున్న లక్షల కోట్ల విలువ చేసే  రైల్వే, ఎల్ ఐ సి, ఎయిర్ ఇండియా, విశాఖ ఉక్కు పరిశ్రమ, బిఎస్ఎన్ఎల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల బాట చూపుతూ మోడీ ప్రభుత్వం అంబాని, ఆధాని లాంటి పారిశ్రామికవేత్తలకు కారు చౌకగా విక్రయిస్తూ దేశ సంపదను కొల్లగొడుతున్నారని తీవ్రంగా విమర్శించారు.  కరోనా విపత్తును ఎదుర్కోవడలోను, బాధితులకు న్యాయం చేయడంలో బీజేపీ, వైసీపీ పాలక వర్గాలు పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు.


యంపీజె రాష్ట్ర కోశాధికారి ఎస్ కె అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ మోడీ హయాంలో దళితులకు, మైనార్టీలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు.  ఏడూ దశాబ్దాల భారతావనిలో అనుగారిన జాతులపై వివక్షతో ఇంకా దాడులు జరగడం హేయమైన చర్యని, దీనికి బిజేపీ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని,పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని,పెగాసెస్ కారణం అయినా కేంద్ర ప్రభుత్వం "క్విట్" కావాలని   డిమాండ్ చేశారు.జిల్లా ఎఐటియుసి కార్యదర్శి ఎస్ కె కాశిం మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ నాయకులు కాలేబ్ మాదిగ మాట్లాడుతూ

రోజు రోజుకు నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందని, కావున ఖాళీగా వున్న ఉద్యోగాలను భర్తీ చేయాలని అలాగే ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి.సోమయ్య, డివైఎఫ్ఐ అధ్యక్షుడు ఏనుగులు సురేష్, ఎంపీజే రాష్ట్ర ఫౌండర్ మెంబర్  షేక్ అబ్దుల్ రసూల్, జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ గఫూర్, జిల్లా సహాయ కార్యదర్శి ఖాశిం (సీఎం), పట్టణ కన్వీనర్ షేక్ గౌస్ భాష, నాయకులు అమీర్, మీరావలి, ఖాశిం పీరా, రఫీ(బుజ్జి), అమ్మార్,  తాపి మేస్త్రీల సంఘం అధ్యక్షుడు పసుపులేటి వెంకటేశ్వర్లు, జీపు మోటారు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పఠాన్ అమీరుల్లా తదితరులు పాల్గొన్నారు.


సి.పి.ఐ. రాష్టృ కార్యవర్గ సభ్యులు అందె. నాసరయ్య

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: