"క్షీర సాగర విజయం" నా ఒక్కడిదే కాదు..

మనీ కోసం కాకుండా మనసు పెట్టి,,,పని చేసిన యూనిట్ మెంబర్స్ అందరిదీ!!

-డెబ్యూ డైరెక్టర్ అనిల్ పంగులూరి


(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)     

     నేనూ నా మిత్రులు రెండేళ్లు ఎంతో ఇష్టంగా కష్టపడి రూపొందించిన "క్షీరసాగర మథనం" చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తుండడం చాలా సంతోషాన్ని, ఒకింత గర్వాన్ని ఇస్తోంది అంటున్నారు చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి. మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా అనిల్ పంగులూరిని దర్శకుడుగా పరిచయం చేస్తూ రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర  ప్రతినాయకుడు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. 

     అక్కడక్కడా చిన్న చిన్న లోపాలు చెబుతున్నప్పటికీ... ఓవరాల్ గా అందరూ మెచ్చుకుంటున్నారని అనిల్ చెబుతున్నారు. మానస్, అక్షత, గౌతమ్ శెట్టి, చరిష్మా, మహేష్ లతోపాటు... ప్రతి ఒక్కరి పాత్ర ఆకట్టుకుంటోందని... అజయ్ అరసాడ సంగీతానికి, సంతోష్ శానమోని కెమెరా వర్క్ కి చాలా మంచి మార్కులు వేస్తున్నారని అనిల్ ఆనందం వ్యక్తం చేశారు.  క్యారక్టర్ అంటే వర్జినిటీ కాదని చెప్పడాన్ని అందరూ ఆప్రిషియేట్ చేస్తున్నారని. అయితే ఈ విజయం తన అక్కడికే సొంతం కాదని... నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ సమానంగా చెందుతుందని అనిల్ పేర్కొన్నారు.  తన తదుపరి చిత్రాన్ని త్వరలోనే ప్రకటిస్తానని పంగులూరి తెలిపారు!!

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: