మాస్టర్‌ చెఫ్‌,,,

@ జెమిని టివి


(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

జెమిని టీవీలో 27 ఆగస్టు 2021 నుంచి ప్రతి శుక్రవారం రాత్రి 8.30 గంటలకు అంతర్జాతీయ వంటల కార్యక్రమానికి  వేదికగా నిలచిన మాస్టర్‌చెఫ్‌ ప్రారంభిస్తున్నట్టు ఇన్నోవేటివ్‌ ఫిలిమ్‌ అకాడమీ ప్రకటించింది. ఎండెమోల్‌ షైన్‌ భాగస్వామ్యంతో సాగే ఈ వంటల కార్యక్రమాలను  జెమినీ టీవీలో మాత్రమే వీక్షించే వీలుంది. బెంగళూరులోని ఇన్నోవేటివ్‌ ఫిలిమ్‌ అకాడమీ ప్రాంగణంలో చిత్రీకరణ జరుపుకొన్న ఈ మాస్టర్‌చెఫ్‌లో అనేక  వంటల పెటీలు నిర్వహించడంతో పాటు  మాస్టర్‌చెఫ్‌ టైటిల్‌ గెలుచుకోవడానికి తీవ్రమైన పోటీ పడుతున్న పాకశాస్త్ర నిపుణులలో విజేతలకు రూ. 25 లక్షల రూపాయల నగదు బహుమతితో పాటు ప్రత్యేక ప్రశంసని అందిస్తారు. నటి తమన్నా భాటియా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి  ప్రముఖ చెఫ్‌లు చలపతిరావు, మహేష్‌ పడాల్‌, సంజయ్‌ తుమ్మ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు.  బట్టర్‌ఫ్లై ప్రయెక్తగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి సహ-ప్రాయోజకులుగా శక్తి మసాలా, హీరో లైఫ్‌ వంట నూనె ప్రత్యేక భాగస్వామి సుధా హాస్పిటల్స్‌, పంపిణీ భాగస్వామిగా ఇన్వెనియో ఒరిజిన్‌లు వ్యవహరిస్తున్నారు. 

ఈ కార్యక్రమంలో ఇన్నోవేటివ్‌ ఫిలిమ్‌ అకాడమీ వ్యవస్థాపకులు శ్రావణ ప్రసాద్‌ మాట్లాడుతూ...‘‘అంతర్జాతీయంగా ముందెన్నడూలేని   ప్రమాణాన్ని నెలకొల్పేలా ఈ కార్యక్రమం ఉందని అన్నారు. దక్షిణ భారతదేశ సంస్కృతి పరిమళాలను వెదజల్లేలా ఈ ప్రదర్శన ఉండబోతోందన్న హామీ ఇస్తున్నామన్నారు.  ఆహారం వండే విధానాలపై ప్రజలకు ఉన్న ఆపేక్షను ఆలండనగా  వినోదం, పాకనైపుణ్య కళల దిశగా జతచేసిన క్రమశిక్షణ కార్యక్రమం మాస్టర్‌ చెఫ్‌ అన్నారు. తెలుగు కార్యక్రమం తెలుగు టెవిలిజన్‌ రంగంలో ఒక విప్లవాత్మకమైన చేరిక. మొత్తం ఫలితాలు మాకు లాభదాయకంగా ఉండే విషయంలో, సమీప భవిష్యత్తులో ఈ ప్రదర్శన హృదయాలను గెలుచుకొంటుందనే సానుకూల దృక్పథంతో ఉన్నాం’’ అని అన్నారు. 


నటి తమన్నా మాట్లాడుతూ... ‘‘ఆహార ప్రియురాలినైన నాకు ఇలాంటి అద్వితీయమైన కార్యక్రమానికి హోస్ట్‌గా ఉండే అవకాశం దొరికినందుకు ఆనందంగా ఉందని,   తెలుగు వంటకాలపై అందునా దక్షిణ భారతదేశానికి చెందిన కొన్ని గొప్ప రుచుల ను పరిచయం చేసే అవకాశం అందిందన్నారు.  


నటుడు అల్లు శిరీష్‌ మాట్లాడుతూ ... ఇది ‘‘మాస్టర్‌చెఫ్‌లో భాగం అయినందుకు నేను చాలా ఆనందంగా ఉందని. జెమినీ టీవీలో. ప్రతిష్టాత్మకమైన ట్రోఫీ కోసం పోటీ పడే ఇంటి-వంట నిపుణులకు ఆల్‌ది బెస్ట్‌ చెప్పారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: