నాడు వెలిగొండను నిర్లక్ష్యం చేసి..

నేడు దీక్షల పేరుతో డ్రామాలు 

టీడీపీ నాయకులది వింత వైఖిరి

వైసీపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ధ్వజం 

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

వెలిగొండ ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని టీడీపీ నేతలు ఆరోపించడం హాస్యాస్పదంగా వుందని వైసీపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. జగన్ ప్రభుత్వం వెలిగొండ పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టుకు అనుమతులు లేవంటూ టీడీపీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆయన ఆరోపించారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగంగా చేస్తుంటే, మరోపక్క నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించడం అర్ధరహితమని అన్నారు. ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయో లేదో.. అక్కడికి వెళ్లి పరిశీలించిన తరువాత మాట్లాడాలని టీడీపీ నేతలకు సూచించారు. వెలిగొండ విషయంలో లేని వివాదాన్ని సృష్టించి తద్వారా రాజకీయ లబ్ది పొందాలని టీడీపీ పధకాన్ని రచించిందన్నారు.

అయితే ప్రజలు ఈ విషయాన్నీ బాగానే పసిగట్టారని, అయితే టీడీపీ చేస్తున్న ఈ దుష్ప్రచారానికి ప్రజల నుండి కనీస మద్దతు కూడా రావడం లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టు నిర్మాణ పనులు తొక్కిపట్టడమే గాక మరోవైపు ముంపు బాధితులకు పునరావాస ప్యాకేజి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని టీడీపీ కపట నీతిని తీవ్రంగా దుయ్యబట్టారు. తీరా ఇప్పుడు దీక్షలు, ధర్నాలు అంటూ డ్రామాలు ఆడటం ఆ పార్టీ నేతలకే చెల్లిందని దుయ్యబట్టారు. ఒకవైపున పునరావాస ప్యాకేజి ఇచ్చేందుకు  ప్రభుత్వం సర్వే చేస్తుంటే దీనిపైన రాద్దాంతం చేయడం తగదన్నారు. ఇకనైనా వెలిగొండ విషయంలో టీడీపీ చేసిన తప్పులను ఒప్పుకోని ప్రభుత్వానికి సహరిస్తే  ప్రజలు కనీసం టీడీపీని గుర్తిస్తారని,లేకపోతే అ గుర్తింపు కూడా కోల్పోతారని  రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి హితవు పలికారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: