బాధ్యతగల నాయకత్వం భరోసా ఇస్తుంది
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ గుర్తింపుకు రెండేళ్లు
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కు ఏపి ప్రభుత్వం నుంచి గుర్తింపు అంది రెండేళ్లు అయిన సందర్భంగా సంఘ బాధ్యులకు, సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు సంఘ కార్యదర్శి అలికాన రాజేశ్వరి చెప్పారు . ఈ సందర్భంగా జరిగిన వేడుకలలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ తమ సంఘానికి గుర్తింపు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తమ సంఘం ఆవిర్భవించి, గుర్తింపు పొందక ముందు నుంచే తమ సంఘం భజనతో కాదు బాధ్యతతో - పార్టీతో కాదు ప్రభుత్వంతో అనే నినాదంతో పనిచేస్తోందని, ప్రభుత్వానికి ఉద్యోగులకు నడమ వారధిగా ఉంటూ అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తు, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా పనిచూస్తూ, ఉద్యోగుల తరపున పోరాటాలు చేస్తున్న నికార్సైన ఉద్యోగ సంఘంగా అంతా గుర్తించడం ఆనందంగా ఉందన్నారామె.
సేవే పరమావధిగా వ్యవహరించాల్సిన సంఘాలు మీకోసం మేమున్నాం అంటూనే మరోవైపు భజన సంఘాలుగా మారిపోయిన తరు|ణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సోదరులందరికీ భరోసా కల్పించేలా 32 సంవత్సరాల ఉద్యోగసంఘ నాయకుడిగా పనిచేసిన అనుభవం సొంతం చేసుకున్న కాశీభట్ల రామ సూర్యనారాయణ గొంతు ఆస్కారరావు లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా 2010లో ఆరంభమైన ఏపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉద్యోగుల సమస్యల పరిష్కారదిశగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమాలే ఉద్యోగులకు ఎంతో చేరువ చేసిందని అదే ఇప్పుడు ప్రభుత్వగుర్తింపు సంఘంగా నిలచిందన్నారు.
కొత్త నేతలను ప్రోత్సహించడంతో పాటు వారిలో సమర్థులైన నాయకులను ఎంపిక చేసి జిల్లాల నాయకత్వ పగ్గాలు అప్పగించడం ద్వారా స్ధానికంగా ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకోవటంతో పాటు అన్ని జిల్లాల్లో పర్యటనలు చేయటం వల్ల ఉద్యోగుల సమస్యలను నేరుగా తెలుసుకుని, ప్రభుత్వ దృష్టికి తీసుకుకెళ్లేలా రూపొందించిన ప్రణాళికలు విజయవంతమయ్యాయని, , అందించడం ద్వారా సమర్థ నాయకత్వాన్ని జిల్లాల్లో ఏర్పాటుచేయగలిగామన్నారు. సమస్యలు ఎప్పటికప్పుడు జిల్లాల మంత్రులకు వివరించేలా ఏర్పాటు చేసిన మహాసభలు ఉపయుక్తమయ్యాయని, నేరుగా సిఎం జగన్‌ని కలసి సమస్యల పరిష్కారం కొరిన ఏకైక సంఘం ఏ.పి.జి.ఇ.ఏ గుర్తింపు పొందిందన్నారు.
మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో తమ సంఘం ముందు ఉండటంతో అనేక మంది మహిళా ఉద్యోగులు తమ సంఘ నిర్మాణంలో కలసి వస్తున్నారని, వారి అండదండలతో మహిళా విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు రాజేశ్వరి.
ట్రేడ్ యూనియన్ ఉద్యమాలే ఊపిరిగా , వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘంలో 25 సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో గొంతి ఆస్కార రావుల కాంబినేషన్లో ఏ.పి.జి.ఇ.ఏ సంఘ లక్ష్యమేమిటో ఉద్యగోగుల సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో పనిచేయటం వల్లే తమ చిత్తశుద్దిని అంతా గమనించారని, సి.పి.ఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వంటి హామీల అమలుకు కమిటీలు వేయించడం, కరోనా కష్టకాలంలో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో కనీసం వారి అంగీకారం లేకుండానే కొన్ని సంఘాల నేతలు ఏకపక్షంగా ఒకరోజు వేతనం 100 కోట్లను విరాళంగా ప్రకటించడాన్ని విభేదించి ఇది న్యాయ సమ్మతం కాదని ఉద్యోగి జీతంలో కోత పెట్టవద్దని ఉద్యోగుల జేబులకు చిల్లు పడకుండా కాపాడటంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రీత్యా వాయిదాల్లో జీతాన్ని చెల్లిస్తామన్న ముఖ్యమంత్రి ప్రతిపాదనను ఒప్పుకొని సామాజిక బాధ్యత నెరవేర్చారన్నారు. ఎన్నో ఏళ్లుగా పదోన్నతులకు నోచుకోని వివిధ శాఖలలోని కేడర్లకు మేలు జరిగేలా పట్టుబట్టి మరీ సర్వీస్ రూల్స్ ను సవరింపచేసి విఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్లుగా, వీ.ఆర్.ఏ.లకు వి.ఆర్.ఓ పదోన్నతులు కల్పించే లా చూడటం తమ సంఘ విజయమన్నారు.
స్వల్ప కాలంలోనే ఎన్నో విజయాలతో రేకెత్తిన ఎన్నో ఆశలు ఉద్యోగవర్గాల్లో ఉన్నాయి సి.పి.యస్ రద్దు , కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, పిఆర్‌సి అమలు వంటి ప్రధాన సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అన్ని సంఘాలకు ఆదర్శంగా నిలుస్తూ అటు ప్రభుత్వంలోనూ ఇటు ఉద్యోగుల్లోనూ విశ్వసనీయత ప్రదర్శిస్తూ పెద్దన్న పాత్రను పోషిస్తోంది. ఆచరణలో ఫలాలు రావాలని ఉద్యోగులందరూ ఆకాంక్షిస్తున్నారని రాజేశ్వరి ఈ సందర్భంగా చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లాగ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు... కూన వెంకట సత్యనారాయణ , ఏపీజీఈఏ నాయకులు నారాయణరావు, భరత్ భూషణ్ రాజ్, చిన్నమ్మడు, శేషు బ్రహ్మాజీ, భాస్కర్,లక్ష్మి నారాయణ, జయమ్మ ,పెద్ద ఎత్తున సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: