లంచం ఇస్తేనే పాసుపుస్తకం అంటున్న విఆర్ఓ
విఆర్ఓ కాశీ విశ్వేశ్వర రెడ్డి పై చర్యలు తీసుకోవాలి
గంగిరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
లంచం ఇస్తేనే పాసుపుస్తకం ఇస్తానంటూ గత మూడు నెలల నుండి తన చుట్టూ తిప్పి కుంటున్న పెద్ద యాచవరం విఆర్ఓ కాశీ విశ్వేశ్వర రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మార్కాపురం రైతు సంఘం నాయకులు గంగిరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారంనాడు మార్కాపురం ఆర్డిఓ లక్ష్మీ శివజ్యోతికి రైతు సంఘం నేతలు ఓ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తనకు వాటాగా మా తండ్రి నుండి రెండు ఎకరాల భూమిని రిజిస్టర్ ద్వారా మార్కాపురం కార్యాలయంలో తన పేరున రిజిస్టర్ చేయించుకున్నాను అని, 2021 జనవరిలో పాసు పుస్తకము కొరకు మ్యుటేషన్ అప్లై చేసినాను అని చెప్పారు. Mutation అప్లై చేసిన మొదటి రోజే 10 వేల రూపాయలు పాసుపుస్తకం కొరకు ఖర్చు అవుతుందని, డబ్బులు ఇస్తేనే తను సిఫారసు చేస్తానని 2021 జనవరిలోనే తనతో వీఆర్వో చెప్పాడని అన్నారు. సిపిఎం నాయకులు అయిన దగ్గుబాటి సోమయ్య, గాలి వెంకట రామిరెడ్డి లను ఆశ్రయించగా వారు అప్పటి తాసిల్దార్ విద్యాసాగర్ దగ్గరికి వెళ్లి మాట్లాడగా తాసిల్దారు కాశీ విశ్వేశ్వర రెడ్డి విఆర్వో ను మందలించి పాస్ పుస్తకం యాక్సెప్ట్ చేసినారు అని తెలిపాడు. అనంతరం మే 5వ తేదీన పాసుపుస్తకం మంజూరు అయిందని,
మద్రాసు నుండి డిస్పాచ్ అయి మే 27వ తేదీన మార్కాపురం తహసిల్దార్ కార్యాలయానికి చేరిందని, చేరినట్లు రిసీవ్డ్ సంతకాలు కూడా తాసిల్దార్ కార్యాలయం వారు చేసినారని, సదరు వివరాలు పోస్ట్ ఆఫీస్ ద్వారా నేను సేకరించినాను అని చెప్పాడు. అయినా కూడా వీఆర్వో కాశి విశ్వేశ్వర్ రెడ్డి పాస్ పుస్తకాలు ఇంకా మార్కాపురం రాలేదని, ఆంధ్ర రాష్ట్రంలో మీ గ్రామం లాంటి బోడపాడు గ్రామాలు చాలా ఉన్నాయి అని బోడపాడు గ్రామానికి నా పోస్టు ద్వారా వెళ్లే అవకాశం ఉందని పాస్ పుస్తకం రావడానికి ఇంకా ఆరు నెలల నుండి సంవత్సరమైనా కూడా పట్టవచ్చును అని విఆర్ఓ అంటున్నాడు అని అన్నారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లి విచారించి పుస్తకాలు తీసుకుని వస్తాను అని ,ఒంగోలు వెళ్లి రావడం కొరకు కారుకు ఐదు వేల నుండి ఏడు వేల వరకు ఖర్చు అవుతుందని, సదరు డబ్బులు ఇచ్చినట్లయితే ఒంగోలు వెళ్లి పాస్ పుస్తకాలు తీసుకొని వస్తా అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడు అని మార్కాపురం ఆర్డిఓ లక్ష్మీ శివ జ్యోతి ముందు రాజశేఖర్ రెడ్డి వాపోయారు. లేదన్న లేనట్లైతే మరల పాసుపుస్తకం కొరకు మీ సేవలో మీ టేషన్ అప్లై చేయండి అని అన్నారు.ఏసీబీ అధికారులను సైతం ఆశ్రయించినాను అని, ప్రకాశం జిల్లా ఏసీబీ డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి గారికి గత నెల రోజులుగా చాలాసార్లు ఫోను చేసి కాశీవిశ్వేశ్వర రెడ్డి తనను వేధిస్తున్నాడని, పాసుపుస్తకం ఇవ్వడంలేదని,లంచం డిమాండ్ చేస్తున్నాడని, చాలాసార్లు ఫోను చేసినా కూడా ఏసీబీ డీఎస్పీ గారి నుండి స్పందన రాకపోవడంతో మీ దగ్గరికి వచ్చినాను అని ఆర్డిఓ లక్ష్మీ శివ జ్యోతి వద్ద రాజశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు మంజూరు అయి వీఆర్వో వద్ద ఉన్న పాసుపుస్తకం కాశి విశ్వేశ్వర్ రెడ్డి ఇచ్చినా కూడా నేను తీసుకోను అని కాసి విశ్వేశ్వర్ రెడ్డి పై చర్యలు తీసుకున్న అనంతరం మాత్రమే నేను పాస్ పుస్తకాలు మీ ద్వారా తీసుకుంటాను అని ఆర్ డి ఓ గారికి రాజశేఖర్ రెడ్డి చెప్పారు. రాజశేఖర్ రెడ్డి కి మద్దతుగా సిపిఎం మార్కాపురం ప్రాంతీయ కార్యదర్శి దగ్గుబాటి సోమయ్య మరియు డివైఎఫ్ఐ అధ్యక్షులు ఏనుగుల సురేష్ కుమార్ ఆర్డిఓతో మాట్లాడుతూ,,
కాశీ విశ్వేశ్వర రెడ్డి డబ్బులు ఇవ్వనిదే ఏ పని కూడా చేయడం లేదని, పాసుపుస్తకం రెండు నెలలుగా తన వద్ద ఉంచుకుని ఒక రైతును ఈ విధంగా తన చుట్టు తిప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని,వెంటనే విఆర్ఓ కాశీ విశ్వేశ్వర రెడ్డి. పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, రైతులను వేధించకుండా తగు చర్యలు తీసుకోవాలని వారు ఆర్డిఓకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆర్డిఓ తహసిల్దా ద్వారా విచారణ చేస్తామని, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని సిపిఎం నాయకులకు ఆర్డిఓ హామీ ఇచ్చారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: