రాష్ట్ర వ్యాప్త ముస్లిం ల సమస్యలపై,,,
బస్సు యాత్ర కరపత్రాల ఆవిష్కరణ
(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)
ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో త్వరలో చేయబోతున్న బస్సు యాత్ర కు సంఘీభావం కొరకు అనంతపురం జిల్లా హిందూపురం లో ఉన్న ముస్లిం ప్రజా సంఘాలను కలుపుకొని సంయుక్తంగా .. బస్సుయాత్ర ను జయప్రదం చేయాలని కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ షేక్ దస్తగిరి అధ్యక్షత న ముస్లిం నగారా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మరియు ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముస్లిం నగారా కార్యాలయం ఆర్టీసీ కాలనీలో జరిగింది కార్యనిర్యాహకులు మాట్లాడుతూ
రాష్ట్రంలో ముస్లిం ల రక్షణ కోసం ఎస్సీ ఎస్టీ చట్టాల తరహా ముస్లిం ల కోసం చట్టాలను ప్రవేశపెట్టాలని .ముస్లిం సామాజిక వర్గానికి మేమెంతో మాకంత జనాభా దామాషా పద్దతిలో జస్టిస్ రంగనాథ మిశ్రా కమీషన్ నివేదిక జస్టిస్ రాజేంద్ర సచ్చార్ కమీషన్ నివేదిక ననుసరించి విద్య ఉద్యోగ రాజకీయ సామాజిక రంగాల్లో కేటాయింపులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయాలని
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలకు అందే షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాలనుత్వరితగతిన అందేలా దృష్టి సారించి ముస్లిం రిజర్వేషన్ చట్టాలపై పార్లమెంటు లో తమ సభ్యులతో చట్ట సభల్లో గళ మెత్తేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞపి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం హక్కుల కై జరిగే బస్సు యాత్రను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ సలహాదారులు సయ్యద్ అన్వర్ హుసేన్. కడపజిల్లా సమన్వయ కర్త సయ్యద్ ఖాజా మైనుద్దీన్. అల్ హింద్ అధ్యక్షుడు ముజాహిద్.హ్యూమనిజం అధ్యక్షుడు అజ్మతుల్లా ఖాన్. టైలర్ అసోషియేషన్ రఫీక్. రోడ్ సేఫ్టీ మొహమ్మద్ రఫీక్ నాసీర్.అబ్దుల్ మాలిక్.మొహమ్మద్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: