పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి
టీడీపీ నేతల డిమాండ్
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన తర్లుపాడు లోని స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కంచర్ల కాశయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో ఎస్ నరసింహులు కు టిడిపి నాయకులు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కంచర్ల. ఈ సందర్భంగా కాశయ్యమాట్లాడుతూ 2017-2018,2018-2019 సంవత్సరాలలో ముందుగా చేసిన ఉపాధి హామీ పథకం పనులకు మెటీరియల్, కాంపోనెంట్ బిల్లులు చెల్లించక పోవడం ఇది కేవలం రాజకీయ కక్ష అని విమర్శించారు.
ప్రాధాన్యత ప్రతిపాదికన పెండింగ్ బిల్లులను చెల్లింపులకు సంబంధించి భారత ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగలో తొక్కి వాటిని పాటించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. గతంలో చేసిన పనులన్నిటికీ గ్రామీణ అభివృద్ధి శాఖ కింద చేపట్టిన అన్నీ మెటీరియల్ కాంపోనెంట్ పనులకు విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం, గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య ఇంజనీరింగ్ విభాగాలు, సాంకేతిక నిపుణులు మరియు క్వాలిటీ కంట్రోల్ వింగ్, పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి బృందాల ద్వారా విచారణ చెయ్యాలని ఆదేశించింది. ఇప్పటికే ఇవన్నీ పరిశీలించి సర్టిఫై చేయడం జరిగిందన్నారు. కానీ ప్రభుత్వం కేవలం కక్షసాధింపు చర్యలతో రీ వెరిఫికేషన్ చేయాలంటూ కాలయాపన చేయడంí చాలా బాధాకరంగా ఉందన్నారు. ఇప్పటికే కోర్టు లో ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు బిల్లులు వెంటనే చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. కానీ ప్రభుత్వం ఈ విధంగా చేయడం కోర్టు ధిక్కారం కాదా. అని ఆయన విమర్శించారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: