దివ్యాంగుల జాతీయ క్రికెట్ జట్టు క్యాప్టెన్ వసంత కుమార్ కు,,
ఫ్రీడం ఫైటర్ టిప్పు సుల్తాన్ షహీద్ జాతీయ పురస్కారం
(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)
ముస్లిం నగారాటిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షతన ఫ్రీడమ్ ఫైటర్ టిప్పు సుల్తాన్ షహీద్ జాతీయ పురస్కారం అందజేశారు ఈకార్యక్రమములో -భారత జాతీయ దివ్యాoగుల క్రికెట్ జట్టు క్యాప్టన్ గా ఎన్నికై జాతీయ స్థాయిలో దేశ గౌరవాన్ని రాష్ట్ర గౌరవాన్ని తెలుగువారి గౌరవాన్ని తారాస్థాయికి అంచెలంచెలుగా తీసుకువెళ్తున్న వసంత కుమార్ గారికి అవార్డు తో సత్కరిస్తూ పుర ప్రముఖులు అఖిల పక్షం సభ్యులు ప్రజా సంఘాలు సేవా సంఘాలు ముస్లిం మత పెద్దలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జాతీయ అంధుల క్రికెట్ సభ్యులు ప్రేమ్ కుమార్ గారు మాట్లాడుతూ దివ్యాంగుల భారతీయ క్రికెట్ తుది జట్టులో స్థానం సంపాదించిన వసంత్ కుమార్
ఇటీవల జరిగినఇండియన్ డిజేబుల్ ప్రపబుల్ల్స్ క్యాంప్ హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియం నందు ఈనెల 3వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఇండియన్ డిజేబుల్ సెలక్షన్ క్యాంప్ బోర్డ్ ఆఫ్ డిజేబుల్ క్రికెట్ అసోసియేషన్ వారు నిర్వహించారు అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన 35 మంది క్రీడాకారులు పాల్గొనగా తుది జట్టులో ఆంధ్ర ప్రదేశ్ ఆటగాడు హిందూపురం , బండమీద పల్లి కుందుర్తి మండలం 2004 నుంచి అద్భుతమైన బాటింగ్ లో అద్భుతంగా రాణిస్తూ ఇండియా డిసబ్లేడ్ క్రికెట్ టీం లో స్థానం సంపాదించాడు బోర్డ్ ఆఫ్ డిజేబుల్ క్రికెట్ అసోసియేషన్ సెలక్టర్ల దృష్టిని ఆకట్టుకున్న వసంత్ కుమార్ ని అధికారికంగా ప్రకటించారు సెప్టెంబర్ లో జరగబోయే ఇండియా v/s బంగ్లాదేశ్ సిరీస్
ఈ సిరీస్ నందు ఒక టెస్ట్ మ్యాచ్, 3 వన్డే ఇంటర్ నేషనల్ క్రికెట్ మ్యాచ్లులు,3 T20 క్రికెట్ మ్యాచ్ లకు మూడు ఫార్మెట్లో వసంత్ కుమార్ ఎంపికకావడం గమనార్హం అన్నారు వసంత్ కుమార్ T-20 ఇండియా జట్టుకు కెప్టెన్ గా ఎన్నికైయ్యారు వసంత్ మాట్లాడుతూ ఈ మూడు ఫార్మాట్లలో స్థానం సంపాదించడం అలాగే కోచ్ సార్ వాళ్ళు అలాగే సెలక్షన్ కమిటీ సభ్యులు వసంత్ నీ అభినందించారు వసంత్ కుమార్ మాట్లాడుతూ నేను ఈరోజు దివ్యాంగుల భారతీయ జట్టులో స్థానం సంపాదించాలంటే నన్ను సపోర్ట్ చేసిన నన్ను ఆర్థికంగా నాకు మంచి స్పాన్సర్ గా ఆదుకున్న ప్రతి ఒక్కరికీ హిందూపురంలోని కొందరు పెద్ద వారు నన్ను ఆర్థికంగా ఆదుకున్నారు బండమీద పల్లి కుందుర్తి మండలం ప్రజలకు తోటి క్రీడాకారులకు , హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఈ సిరీస్ నందు బాగా ఆడి మన మండలం పేరును జిల్లా పేరును దేశవ్యాప్తంగా తెలియజేసేలా చేస్తానని ముఖ్యంగా
నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మా తల్లిదండ్రులు మరియు మా BDCA జనరల్ సెక్రటరీ రామిరెడ్డి గారు హిందూపురం వాసులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానన్నారు దేశం కోసం దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానన్నారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ దేశ గౌరవాన్ని దేశం తలెత్తుకొనేలా దేశ ప్రతిష్టను పెంచే వసంత్ కుమార్ లాంటి యువకులను కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించి గౌరవించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వసంత్ కుమార్ కు పుర ప్రముఖులు జామియా మసీదు ముతవల్లీ తలహా ఖాన్.మాజీ శాసన సభ్యులు హజీ అబ్దుల్ ఘనీ.జేవీ. అనిల్ కుమార్. బాలాజీ మనోహర్. డీఈ.రమేష్ కుమార్. దుర్గానవీన్. రఘు. మౌలానా అబ్దుల్ హసీబ్. మౌలానా తoజీల్. మౌలానా సయీద్. ఎస్డీజీఎస్ కళాశాల ప్రిన్సిపల్ నాగేంద్ర కుమార్. అజ్మతుల్లా. ముజ్జు. టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం అధ్యక్షులు షేక్ షబ్బీర్ తదితరులు పాల్గొని అభినందించారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: