రోడ్డు ప్రమాదాలు...అప్రమత్తతపై...
మార్కాపురం పోలీసుల అవగాహన కార్యక్రమం
పాల్గొన్న ఆటో, ట్రాన్స్ పోర్టు డ్రైవర్లు
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
మార్కాపురం డివిజన్ డి.ఎస్పి. కిషోర్ కుమార్ ఆదేశానుసారం, ఈ మధ్య కాలంలో జరిగుతున్న వాహన ప్రమాదాల దృష్ట్యా గురువారంనాడు మార్కాపూరం టౌన్ పోలీస్ స్టేషన్ నందు పోలీసు అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో పట్టణ, పరిసర ప్రాంత ఆటో డ్రైవర్లతో పాటు ట్రాన్స్ పోర్ట్ వాహనాల డ్రైవరులను పిలిపించి డ్రైవర్లు పాటించవలసిన నియమ-నిబంధనలు, జాగ్రత్తల గురించి అవగాహన కార్యాక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సి.ఐ. బి.టి. నాయక్ మాట్లాడుతూ ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించికొని ప్రయాణించడం వలన జరిగే ప్రమాదాల గురించి వివరిస్తూ,
ఇకమీదట ఎవరు కూడా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్తున్నా లేదా సరుకు రవాణా వెహికల్స్ లో ప్రయాణికుల్ని తీసుకొని వెళుతున్నా, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది, అదేవిధంగా మార్కాపూర్ టౌన్ లో ఆటో నడుపు ఆటోడ్రైవర్లు ఆటోలను ఎక్కడపడితే అక్కడ ఆపి మిగతా ప్రజలకు ఇబ్బంది కలిగించరాదని అలా కలుగ చేసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా టౌన్ ఎస్ఐ తెలియజేయడం జరిగింది, అదేవిధంగా మార్కాపూర్ టౌన్ నుంచి వివిధ గ్రామాలకు వెళ్లే ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నట్లయితే అట్టి వారిపై నూతన మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం అధిక మొత్తంలో పెనాల్టీ రుసుము వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. రూరల్ ఎస్.ఐ. కోటయ్య మాట్లాడుతూ మండల పరిధిలో అధిక సంఖ్యలో ప్రయాణికులను తీసుకొని వెళుతున్నా ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము అపరాధ రుసుము విధించడం జరిగింది, ఈ సందర్భంగా ఆటోడ్రైవర్లకు మరియు ప్రయాణికులకు తెలియజేయునది ఏమనగా పరిమితికి మించి ఆటోలో ప్రయాణం చేయడం వల్ల ఈ మధ్యకాలంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి కనుక ఆటో డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం చేయరాదు, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమములో అర్బన్ మరియు రూరల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: