ఇమామ్..మౌజాన్ లకు
గౌరవ వేతనం మంజూరు
(జానో - జాగో వెబ్ న్యూస్- మార్కాపురం ప్రతినిధి)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా 2021-2022 ఆర్ధిక సంవత్సరమునకుగాను రాష్టములోని దాదాపు 5000 మంది ఇమాములకు నెలకు 5వేలా రూపాయాల.నుంచి 10 వేలా రూపాయాలుగాను మరియు మౌజన్ లకు సంబంధించి నెలకు 3వేలా రూపాయాల నుంచి 5వేలా రూపాయాలుగా పెంచబడిన గౌరవ వేతనాలను మే నెల మరియు జూన్ నెలలకుగాను రూ. 14 కోట్ల 74 లక్షల రూపాయాలను ఆయా మసీదు కమిటీల యొక్క జాయింట్ అకౌంట్ లనందు జమచేయడమైనదని, అలాగే జూలై నెలకు సంబంధించిన గౌరవ వేతనము రూ 7 కోట్ల 38 లక్షల రూపాయాలు ఆయా మసీదుల అకౌంట్ల నందు జమ చేయడం జరుగుచున్నదని, ఇక మీదట గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఇమాములకు, మౌజన్లకు ఇచ్చే గౌరవవేతనాలను ఖచ్చితంగా ప్రతి నెల జమ చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మైనారిటి సంక్షేమ శాఖామవ్యవహారాల మంత్రి అంజాద్ బాష తెలియచేశారు.
ఈ సందర్భంగా కొన్ని జిల్లాల నుండి మరియు కొన్ని మండలాలనుండి మసీదుల కమిటీవారు ఇమామ్ మరియు మౌజన్ల విషయములో, వారిని చిన్న చూపుచూస్తూ , వారి గౌరవ వేతనాల విషయాలలో వారికి న్యాయం చేయకుండా అక్రమాలకు పాలుపడుతున్నట్లు మా దృష్టికి వస్తున్నాయి త్వరలోనే దశలవారిగా అన్ని మసీదులను పర్యావేక్షిస్తామని తెలిపారు. కావున మసీదు కమిటీలు పై విధముగా విడుదలయ్యే మొత్తాలను ఆయా మసీదుల ఇమాములకు మరియు మౌజన్లకు ప్రతి నెల ఖచ్చితముగా ఎలాంటి జాప్యము లేకుండా చెల్లించవలసినదిగా ఆదేశించడమైనదని తెలిపారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: