సమ సమాజ స్థాపన కోసం కృషి చేయాలి
జమాఅతె ఇస్లామీ హింద్ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ మజీద్ సోహేబ్
(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)
జమాతే ఇస్లామీ హింద్ ఖమ్మం శాఖ ఆధ్వర్యంలో నేడు జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ అబ్రార్ అలీ అధ్యక్షతన సబ్యుల మరియు కార్యకర్తల సమావేశం నిర్వహించబడినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాలున్నరాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ మజీద్ సోహేబ్ మాట్లాడుతుడు ముస్లిం సమాజం సంస్కరణ, మార్గం దర్శకత్వం, నిర్మాణం, మంచిని పెంచడం, చెదును అడ్డుకోవడం వంటి సమ సమాజ స్థాపన కోసం కృషి చేయాలని శాంతియుత పరిస్థితులను స్థాపించ దానికి ఆచరణాత్మకంగా, శాంతియుతంగా ప్రయత్నించాలి. ప్రతి ముస్లిం తన ధార్మిక బాధ్యతలను గుర్తించాలని అన్నారు. ముస్లిం సమాజం అసలు లక్ష్యం ఒక్కటే అది.. అందరు సమైక్యంగా అల్లాహ్ పంపించిన ధర్మానికి నిజాయితీగా, చిత్తశుద్ధితో కట్టు బడాలని అన్నారు. ముస్లిముల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. సామాజికంగా, రాజకీయంగా వెనుకబాటుకు గురయ్యారు. విద్యారంగంలో, ఆర్థిక రంగంలో వెనుకబడ్డారు. దీనికి ముఖ్యం కారణం ముస్లిములు తమ జీవితలక్ష్యం ఏమిటో మరిచిపోయి దానికి దూరమవ్వడం, ఇస్లామీయ సమైక్యత వారిలో లోపించడం అని అన్నారు. ఈ కార్యక్రమములో జమాతే ఇస్లామి హింద్ జిల్లా రూరల్ అధ్యక్షులు అబ్దుల్ ముజీబ్ , జమాతే ఇస్లామి హింద్ ఖిల్లా డివిజన్ అధ్యక్షులు ఖలీల్ అహ్మద్ ఖాన్, ఇస్లాం పేట డివిజన్ అధ్యక్షులు అబ్దుస్ సుబూర్, ఇందిరా నగర్ డివిజన్ అధ్యక్షులు జమిల్ అహ్మద్ ఖాన్, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఇండియా పట్టణ కార్యదర్శి తౌసిఫ్ అహ్మద్ ఖాన్ , మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా అధ్యక్షులు ఖాసీం, జిల్లా మహిళా అధ్యక్షురాలు సైదా భాను, రూరల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఖాసీమా షాహీన్ ఖిల్లా డివిజన్ అధ్యక్షురాలు రహిమున్నిసా బేగం, ఇందిరా నగర్ డివిజన్ అధ్యక్షురాలు వహెదా , ఇస్లాం పేట డివిజన్ అధ్యక్షురాలు ఫాతిమా బేగం సబ్యుల మరియు కార్యకర్తలు తదతరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: