మీరిచ్చిన హామీలను అమలు పర్చండి

ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డికి కాంగ్రెస్ బహిరంగలేఖ


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

పలు సందర్భాలలో పొదిలి పర్యటనకు వచ్చిన సందర్భంగా పలుమార్లు మీరిచ్చిన హామీలు చాలా ఉన్నాయని, వాటిని నెరవేర్చాలని మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డికి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ షేక్ సైదా కోరారు. మీరిచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రజలు కోరుతున్నారు అంటూ ఎమ్మెల్యేకు ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ విశేషాలు ఇలా ఉన్నాయి.... తమరు 2019 ఎన్నికల ప్రచార సమయంలో అలాగే  ఎన్నికల అనంతరం పొదిలి మండలానికి పర్యటనకు వచ్చిన పలు సందర్భాల్లో ఈ క్రింది కనబర్చిన పలు హామీలు ఇచ్చారు, వీటిని నెరవేర్చాలని మండలంలోని ప్రజలు తమరికి విజ్ఞప్తి చేయుచున్నారు. (వీటి మీద మండల అభివృద్ధి సమావేశంలో చర్చించాలని కోరుతున్నారు).

(1). పొదిలి లో తాగునీటి ఎద్దడి నివారణ కొరకు పొదిలి పెద్ద చెరువులో 100 ఎకరాలలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టి ఇంటింటికి మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసి రక్షిత మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు దీనిమీద అభివృద్ధి సమావేశంలో చర్చించండి.

(2) 2019 సంవత్సరం ఖరీఫ్ సీజన్లో పొదిలి మండలం లో సకాలంలో వర్షాలు కురవక 11,723 హెక్టార్లలో వివిధ పంటలు   నష్టపోయిన దాదాపు 14 వేల 327 మంది రైతులకు చెందవలసిన నష్టపరిహారం దాదాపు 4  కోట్ల రూపాయలు చెల్లించాలని ఆందోళన చేపట్టిన రైతులకు ముఖ్యమంత్రితో మాట్లాడి, అలాగే క్రాఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల తో మాట్లాడి నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పిన హామీ ఏమైంది?

(3) పొదిలి పట్టణంలో దాదాపు రెండు వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులు చెరువులు,వాగులు ,అలుగులు, పంట కాలువలు, స్మశానాలు,దేవస్థానం భూములు ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ లు, అపార్ట్మెంట్లు, ఇండ్లు నిర్మించి అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ బహిష్కృత నేత వెళ్లి శెట్టి వెంకటేశ్వర్లు పై చర్యలు తీసుకోవాలని పలుమార్లు స్వయంగా కలిసి విన్నవించిన సందర్భంలో పది రోజుల్లో చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీ

గురించి ఆలోచించండి.

 

మీరు ,మీ కుటుంబ సభ్యులు భూ బకాసురుడి అక్రమాలకు అండగా ఉన్నారని, సదరు భూ బకాసురుడు బహిరంగంగానే ప్రచారం చేసుకుంటూ అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నారు, ఈ విషయం మీ దృష్టికి రాలేదా?

(4) పొదిలి నగర పంచాయతీలో దాదాపు తొంభై ఆరు మంది పారిశుద్ధ్య కార్మికులు గత ఏడు నెలలుగా జీతాలు లేక, అప్పులు ఇచ్చే నాథుడు లేక, ఆకలితో అలమటిస్తున్నారు దాదాపు 60 లక్షల పైగా బకాయిలు పెండింగ్లో ఉన్నాయి వాటి గురించి మాట్లాడండి.

(5) పొదిలి గ్రామ సర్వేనెంబర్ 1177/1 లో మీ పార్టీ నాయకులు బినామీ పేర్లతో విలువైన ప్రభుత్వ భూముల్ని రెవెన్యూ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి అసైన్డ్ కమిటీ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించిన వారికి "ఎక్సాల్ పర్మిషన్ లు" తీసుకున్నట్లు తెలుస్తోంది. వీటిమీద చర్చించండి.

(6) పొదిలి మండలం లో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం( MNREGS) ద్వారా చేపట్టిన జగనన్న  కాలనీల అభివృద్ధి మరియు ఇతర పనుల్లో జరిగిన కోట్లాది రూపాయల అక్రమాల గురించి చర్చించండి.

(7) మంచి నీటి ట్యాంకర్ల ద్వారా నీటి పంపిణీ విధానంలో కాంట్రాక్టర్లు,RWS అధికారులు కుమ్మక్కై ఈ రెండు సంవత్సరాల కాలంలో కోట్లాది రూపాయలు ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతున్న టు తెలుస్తుంది వీటిమీద చర్చించండి.

(8). మండలం లో పంచాయతీ రాజ్, ఇరిగేషన్,

ఉపాధి హామీ పథకం తదితర శాఖల ద్వారా జరిగే అభివృద్ధి పనులు నాసిరకంగా జరుగుతున్నాయి వాటి మీద దృష్టి సారించండి.

(9). మండలంలో ప్రతి పేదవానికి జగనన్న కాలనీల ద్వారా ప్రభుత్వ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఇచ్చిన హామీ మీ భూమి పూజ కే పరిమితమైంది దీని గురించి మాట్లాడండి.

(10). ప్రస్తుత తరుణంలో"కరోనా మహమ్మారి వ్యాప్తి  జిల్లాలోనే పొదిలి ప్రథమ స్థానంలో ఉంది గతంలో మీరు పొదిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ నివారణ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పిన మాట ఏమైంది?

(11). పొదిలి మండలం లో మూసీ నది పరివాహక ప్రాంత గ్రామాల్లో ఇసుక మాఫియా రెచ్చిపోయి అక్రమంగా ఇసుకను తరలించి కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతున్నారు, ఇదేమని ప్రశ్నించిన గ్రామ సర్పంచ్ ని బెదిరిస్తున్నారు దీని గురించి మాట్లాడండి. దీనికి ఉదాహరణ నేడు పొదిలి లో జరిగిన జగనన్న స్వచ్ఛత కార్యక్రమంలో

ఈగలపాడు సర్పంచ్ భర్త ఎర్రం సుబ్బారెడ్డి మాట్లాడిన మాటలే నిదర్శనం.

(12) మద్యం మాఫియా -- మండలంలో మద్యం మాఫియా కనుసన్నల్లో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన పిచ్చి బ్రాండ్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు ఆ మద్యం తాగిన వారు అనారోగ్యం పాలవుతున్నారు ఈ విషయంలో అనేక పర్యాయాలు వివిధ పత్రికల్లో రావడం జరిగింది నిన్ననే ఒక మందు బాబు మద్యం షాపు ముందు పండుకొని ఈ విషయమై నిరసన తెలియజేయడం జరిగింది.

(13) పెద్ద చెరువులో అక్రమంగా గ్రావెల్ తవ్వి తమ రియల్ ఎస్టేట్ వెంచర్ లకు మట్టిని తరలించిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల పై, అక్రమ వెంచర్లు పై చర్యలు తీసుకోండి.

(14) పొదిలి మండల రెవెన్యూ శాఖ లో గతంలో జరిగిన ,ప్రస్తుతం జరగడానికి ఆస్కారం ఉన్నా అక్రమ ఆన్లైన్ భూముల వ్యవహారంపై దృష్టిని సారించండి.

పై కనపరిచిన 14 అంశాలమీద తమరు గౌరవ ప్రజాప్రతినిధిగా నేడు పొదిలి మండలం లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ శాఖ అధికారుల సమావేశంలో చర్చించి తగు చర్యలు చేపట్టాలి అని కోరుతున్నాను. అని షేక్ సైదా ఆ లేఖలో పేర్కొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: