షార్ట్ సర్క్యూట్ తో...రోడ్డున పడ్డ కుటుంబం

మంటల్లో ఇంటితో సహా సర్వం కోల్పోయి

ఆదుకోవాలని బాధిత కుటుంబం వినతి


(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా గడివేముల మండల పరిధిలో చిందుకూరు గ్రామంలో లో విషాద ఛాయలు అలముకున్నాయి. చిందు గ్రామంలో అర్ధరాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ అవడంతో బీసీ కాలనీలోని సుధాకర్ ఇంట్లో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో భయభ్రాంతుల కు గురి అయిన సుధాకర్ (43) అతని భార్య ఇంద్రావతి (35) సంవత్సరాలు తమ ఇద్దరు కూతుళ్ల వైష్ణవి ఐదు సంవత్సరాలు, చిన్న కుమార్తె మైదా మూడు సంవత్సరాల పిల్లలను భుజాన వేసుకుని రోడ్డు పైకి పరుగులు తీశారు.

 


 


ఒంటి గంట సమయం కావడంతో ఇంటి పక్కల చుట్టి వాళ్ళు అందరూ గాఢనిద్రలో ఉండడంతో మంటలు చెలరేగి ఇంటిలోని నిత్యవసర వస్తువులు ఇంట్లో ఉన్న సామాన్లు రూ.20వేల రూపాయల నగదు పత్తి విత్తన ప్యాకెట్లు, మొక్కజొన్న, ఇతర ప్యాకెట్లు మొత్తం ఖాళీ బూడిదయ్యాయి. విద్యుత్ షార్ట్ కట్ టు జరగడంతో తమ సర్వస్వం కోల్పోయామని తమ కుటుంబ సభ్యులు అందరూ దిక్కుతోచని పరిస్థితిలో రోడ్లపైన ఉన్నామని, తమను ప్రభుత్వం గానీ ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు గాని రెవిన్యూ సిబ్బంది తమ ఆవేదన అర్థం చేసుకొని మాకు సహాయ సహకారాలు అందించి మిమ్మల్ని ఆదుకోవాలని సుధాకర్ దంపతులు కోరుకుంటున్నారు. సుధాకర్ కుటుంబానికి జరిగిన అన్యాయం పై గ్రామ ప్రజలు స్పందిస్తూ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందేలా చూడాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 


 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: