ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం

 ప్రకాశం జిల్లా ఎస్పీ  మలిక గర్గ్, (ఐపీఎస్.)

(జానో జాగో వెబ్ న్యూస్- మార్కాపురం ప్రతినిధి)

 ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపీఎస్ జిల్లా పోలీస్ కార్యాలయం నందు 75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయంలో పనిచేస్తున్న వివిధ విభాగాలు మరియు జిల్లా పోలీస్ కార్యాలయం సిబ్బంది ఎస్బి-1, ఎస్బి-2, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్, డిసిఆర్బి, డిపిఓ, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొని జెండా వందనం చేసినారు. కోవిడ్ నిబంధనలు అనుసరించి సామాజిక దూరం పాటిస్తూ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఎస్పీ మాట్లాడుతూ..

ఎందరోదరో త్యాగమూర్తుల త్యాగఫలితమే ఈ స్వాతంత్ర్యమని, వారి త్యాగఫలాన్ని మన  భారతీయులందరు ఇప్పుడు ఆనందంగా అనుభవిస్తున్నామని, స్వాతంత్ర సమరయోధులను గుర్తుచేసుకుంటూ వారిని స్పూర్తిగా తీసుకొని ఎల్లవేళలా దేశ సేవకు, ప్రజ సేవకు సంసిద్ధులై ఉండాలని, ప్రజల సమస్యలను పరిష్కరించటంలో ప్రకాశం పోలీసులు ఎల్లవేళల్లో ముందంజలో వుంటారనే భరోసా ప్రజలలో కల్పించాలని  సిబ్బందికి తెలియచేసినారు. ఎస్పీ గారు అందరికి మిఠాయిలను మరియు చాక్లెట్లు పంచి పెట్టినారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్పీ  బీ.రవి చంద్ర , OSD కె.చౌడేశ్వరి, ఏ. ఆర్.అడిషనల్ ఎస్పీ టి.శివ రెడ్డి, డి.ఎస్.పి బి.మరియాదాసు, ఏ.వి.రమణ , ఏ ఆర్ డి ఎస్ పి కె..రాఘవేంద్ర రావు, SB-1 కె.వి..రాఘవేంద్ర , SB -2 N.శ్రీకాంత్ బాబు, ఏవో యం. సులోచన , సీఐ ఎస్ ఐ, ఆర్ ఐ లు పాల్గొన్నారు.


 


✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: