రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ర్టేషన్ కార్యాలయాల్లో..
బోగస్ చలానాలపై తనిఖీలు
( జానో - జాగో వెబ్ న్యూస్ - మార్కాపురం ప్రతినిధి)
సిఎఫ్ఎంఎస్ విధానంలో లోపాలను ఆసరాగా చేసుకుని కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. కడప, కర్నూలు, ప్రకాశం, నంద్యాల, పులివెందుల, తిరుపతి అర్బన్ తదితర చోట్ల ఇలాంటి మోసాలు జరుగుతున్నట్లు తెలియడంతో.. ‘బోగస్ చలానాలతో ఖజానాకు గండి’ అనే శీర్షికతో ‘పత్రికలలో’ కథనం ప్రచురించింది.
దీనిపై ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లోనూ గత మూడు నెలలుగా డాక్యుమెంట్ల రిజిస్ర్టేషన్‌కు వచ్చిన చలానాలను పరిశీలించాలని మరియు ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము మొత్తం వచ్చిందో లేదో చూడాలని స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్స్ శాఖ ఐజీ శేషగిరిబాబు ఆదేశించారు. ఈ మేరకు కడప సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో 10 బోగస్ చలానాలను గుర్తించారు. కడప అర్బన్, రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో స్టాంపుడ్యూటీ రుసుమును, డాక్యుమెంట్ రైటర్ జయరామకృష్ణ బోగస్ చలానాలతో స్వాహా చేసినట్లు తేలడంతో ఆయనపై ఫోర్జరీ, చీటింగ్ కేసు నమోదు చేశారు. మిగతా కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
మరోవైపు రిజిస్ర్టేషన్ చేయించుకునేవారు ఎంత మొత్తం చలానాగా కట్టారన్నది సబ్ రిజిస్ర్టార్ కంప్యూటర్‌లోనూ కనిపించేలా సీఎఫ్ఎంఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు.
సోమవారం నుంచి ఈ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేయనున్నారు.
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: