స్వాతంత్య్ర సమర యోధుడు టిపు సుల్తాన్

ఉద్యమ చరిత్రలేనివారు ఆ యోధుడిని విమర్శించడమా

జానోజాగో మహిళా నాయకురాలు జరీనా సుల్తానా

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

స్వాతంత్ర్య సంగ్రామంలో పాలుపంచుకొని వారు కూడా నిజమైన స్వాతంత్ర్య సమరయోధులను అవమానించేలా చేయడం సిగ్గుచేటని జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం మహిళా విభాగం ఏపీ రాష్ట్రా అధ్యక్షురాలు జరీనా సుల్తానా అన్నారు. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ముస్లిం సమాజంలోని 70శాతం మేర ప్రజలు నాడు ప్రత్యక్షంగా పాల్గొన్నారని ఆమె వెల్లడించారు. ముస్లిం మహిళా వీరానారులు సైతం నాటి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని అన్నారు. ఇది నోటిమాటగా చెప్పడంలేదని చరిత్రలో దీని ఆధారాలు అందుబాటులో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.  బ్రీటీషర్లకు ఎదురోడి పోరాడిన వారిలో టిపుల్ సుల్తాన్, వారి తండ్రి హైదర్ అలీ కూడా ఉన్నారని, అలాంటి యోధులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని టిపు వ్యతిరేక నినాదాలు చేసే వారిని ఆమె ప్రశ్నించారు. ఎందరో ముస్లింలు దేశం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయారని, అలాంటి వారి చరిత్ర నేటికి వెలుగులోకి రాకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.  మాన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి అణుపితామహుడిగా పేరుగాంచి ఈ దేశానికి ఎంతో సేవ చేశారని ఆమె పేర్కొన్నారు. కరోనా సమయంలో ఎంతో మంది ముస్లింలు తమ చిరు వ్యాపారాలలోనుంచి ఆదాయం తీసుకొని కులం, మతం అని చూడకుండా హిందూ, క్రైస్తవ ఇలా అందరిని ఆదుకొనే ప్రయత్నం చేశారని ఆమె వెల్లడించారు. ఇప్పటికైనా స్వాతంత్ర్య సమరయోధులను గౌరవించడం అలవర్చుకోవాలని వివాదాలు స`ష్టించేవారికి ఆమె హితవు పలికారు. 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: