త్వరలో....ఇళ్లకు....
“స్మార్ట్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్స్“
ఇక ముందే డబ్బులు చెల్లించి కరెంటు తెచ్చుకోవాలి
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)
కేంద్ర సర్కార్ విద్యుత్ రంగంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కొత్తగా స్మార్ట్ మీటర్లను తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా కరెంటు వినియోగదారులు ముందుగానే డబ్బులు కట్టాల్సి రావచ్చనే అంచనాలు ఉన్నాయి. అంటే డబ్బులు కట్టి కరెంటు వాడుకోవాల్సి ఉంటుందన్నట్లు. ప్రస్తుతం మనం నెలంతా కరెంటు ఉపయోగించుకొని, బిల్లు వచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు చెల్లిస్తున్నాం. కానీ కొత్త స్మార్ట్ మీటర్లు వచ్చిన తర్వాత మీరు ముందుగానే మీ కరెంటు మీటరును రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఎంత మొత్తానికి అయితే మీరు రీచార్జ్ చేసుకుంటారో.. ఆ మొత్తం వరకు మీరు కరెంటు వాడుకునే ఛాన్స్ ఉంటుంది..
ఇక నివేదికల ప్రకారం రీచార్జ్ మొత్తం అయిపోయిన వెంటనే మీ ఇంట్లోకి కరెంటు సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. మళ్లీ మీరు రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ముందుగానే రీచార్జ్ చేసుకుంటేనే మీరు కరెంటు ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వపు నిర్ణయం ప్రకారం 2023 డిసెంబర్, 2025 మార్చి నాటికి రెండు విడతల్లో దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
రైతులకు మినహాయించి మిగతా వారందరికీ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది.ఇలాంటి సదుపాయం వచ్చిన తర్వాత కరెంటును పొదుపుగా వాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా పొదుపుగా వాడుకున్నా.ఎంత బిల్లు వచ్చిన తర్వాత కట్టాల్సి ఉంటుంది. కరెంటు సరఫరా నిలిచిపోయే అవకాశం ఉండదు. ఈ స్మార్ట్ మీటర్లు వస్తే ముందుగా రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ రీఛార్జ్ అయిపోతే కరెంటు నిలిచిపోతుంది. సామాన్య ప్రజలకు సమయానికి చేతిలో డబ్బులు లేక రీఛార్జ్ చేసుకోలేని పరిస్థితి ఉంటే ఇంట్లో చీకటిలోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: