గ్రామీణ వైద్యులకు అవగాహన సదస్సు
హాజరైన ప్రముఖ వైద్యులు
ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ ఇమామ్ సాహెబ్
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
డాక్టర్ బి.సి.రాయ్ ఫస్ట్ ఎయిడ్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ ఇమామ్ సాహెబ్ అధ్యక్షతన ఆదివారం నాడు కంభం పట్టణం నందు ఆల్ఫా స్కూల్ ప్రాంగణంలో గ్రామీణ వైద్యుల అవగాహన సదస్సు జరిగింది. నరసరావుపేట శేషాద్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యులకు వివిధ రకాల వ్యాధులపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సంధర్భంగా డాక్టర్ రామ్ కిషన్ గోనుగుంట్ల (MS MCH) క్యాన్సర్ వ్యాధి నిపుణులు వీరు క్యాన్సర్ వ్యాధిని ముందుగా ఎలా కనుక్కోవాలి వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదాని గురించి గ్రామీణ వైద్యులకు అవగాహన కల్పించారు, అలాగే డాక్టర్ కృష్ణచైతన్య (MS ORTHO) ఎముకలు ,కిల్లవ్యాధులగురిచి బాధపడుతున్న వారిని ఎలా గుర్తించాలో వాటి గురించి తగిన సూచనలు ఇచ్చారు.
అలాగే డాక్టర్ రాజేష్ (MD DM) రుగ్మతలజీ ఈ డాక్టర్ పశ్చిమ ప్రకాశంలో ఫ్లోరిన్ శాతం ఎంతో ఉందని కీళ్ల నొప్పులు అలాగే మోకాళ్ళ లో గుజ్జు వాటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లో బీసీ బీసీ రాయ్ ఫస్ట్ ఎయిడ్ ప్రొవైడర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఇమాం సాహెబ్, ఉపాధ్యక్షులు మహబూబ్ బాషా, జిల్లా కార్యదర్శి రంగనాయకులు, జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, అధికార ప్రతినిధి మౌలాలి, గిద్దలూరు నియోజకవర్గ అధ్యక్షులు ప్రసాదరావు, మూడు మండలాల నుంచి వచ్చిన నాయకులు, ఈ కార్యక్రమంలో సుమారుగా 125 మంది గ్రామీణ వైద్యుల పాల్గొన్నారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: