తిలాపాపం తలాపడికెడు...?

ఆగ్రరాజ్యాల పోరులో అణగారిన అప్ఘానిస్తాన్‌

అప్ఘానిస్తాన్‌పై ఆధిపత్యంకు తహతహ...

అదే అక్కడి ప్రజలకు శాపంగా మారిందా....? 


ప్రస్తుతం ప్రపంచం మొత్తం దృష్టి  అంతా అప్ఘానిస్తాన్‌పైనే ఫోకస్‌ అయ్యి వుంది. అగ్ర రాజ్యాలకు అఫ్గానిస్తాన్‌ ఒక క్రీడా మైదానంగా మారిపోయింది. ఒకప్పుడు రష్యా, అటు తర్వాత అమెరికాలు తమ స్వార్థం కోసం అఫ్గానిస్తాన్‌ తమ అసవరాలకు వాడుకున్నాయి. ఒకప్పుడు 1978 లో రష్యా అఫ్గాన్‌లో కీలు బొమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రష్యాను వెళ్లగొట్టడానికి అమెరికా రంగంలోకి దిగింది. రష్యాను వెళ్లగొట్టడానికి బిన్‌లాడెన్‌ ప్రోత్సహించింది అమెరికా.. చివరకు రష్యా ఖజానా ఖాళీ అయ్యిన తర్వాత కానీ తత్వం బోధపడలేదు.


రష్యాను ముక్కులు చెక్కులు చేసే వరకు అమెరికా నిద్రపోలేదు. అలా అని అమెరికా అయినా బాగుపడిందా అంటే అదీ లేదు. రష్యా దశాబ్దం కాలం పాటు కాబూల్‌లో మకాం వేసి దేశం దివాలా తీసుకొనే స్థాయికి వెళ్లింది. ఇక ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు బైడన్‌ కూడా త్వరగా కళ్లు తెరిచి అఫ్గాన్‌ నుంచి నిష్ర్కమించడమే మేలనుకున్నారు. తాలిబన్లను ఓడించలేమని తెలుసుకున్నారు. రెండు దశాబ్దాల పాటు అఫ్గాన్‌లో తిష్టవేసి యుద్ధం చేసినందుకు అమెరికాకు సైనికుల ప్రాణ నష్టంతో పాటు రెండు ట్రిలియన్‌ డాలర్లు భారతీయ కరెన్సీ ప్రకారం 150 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాపై భారం పడింది. 


దక్షిణాసియా జనాబా సుమారు 194 కోట్ల. వారిలో3.9 కోట్ల మంది అంటే దక్షిణాసియా జనాభాలో రెండు శాతం అఫ్తానిస్తాన్‌లో ఉన్నారు. ఇంత తక్కువ జనాభా దక్షిణాసియాలో పెద్ద ప్రభావం చూపదు. స్థిరమైన ప్రభుత్వం ఉంటే దక్షణాసియా ఆర్థిక వ్యవస్థ ఎంతో కొంత ఉపయోక్తంగా ఉంటుంది. ఆఫ్గాన్‌ ఆర్ధిక వ్యవస్థను ఒకసారి చూద్దాం. దక్షిణాసియా దేశాలతో పోల్చుకుంటే దీని గురించి పెద్ద గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరూ పెద్దగా పట్టించుకోరు కూడా. ఎందుకంటే దక్షిణాసియా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దీని వాటా పెద్దగా లేదు. అఫ్గానిస్తాన్‌ ప్రధానంగా పాకిస్తాన్‌పైనే ఎక్కువ ఆధారపడి ఉంది. అఫ్గాన్‌ తన ఎగుమతులను పాకిస్తాన్‌ ద్వారానే జరుపుతోంది. 2015లో ఆప్గాన్‌ తన దిగుమతులను పాకిస్తాన్‌ ద్వారానే తెప్పించుకుంది. 

తలసరి ఆదాయం చాలా తక్కువ

ఇక అఫ్గానిస్తాన్‌ తలసరి ఆదాయం చూస్తే దక్షిణాసియాలోనే అతి తక్కువ. ఇక మరో అంశం ఏమిటంటే అఫ్గానిస్తాన్‌ అభివృద్దికి విదేశాల నుంచి బిలియన్‌ల కొద్ది డాలర్లు వచ్చినా ప్రజల జీవితాలు మెరుగుపడింది మాత్రం లేదు. ఇక జీడీపీ, తలసారి ఆదాయం  విషయానికి వస్తే నేపాల్‌ కంటే కాస్తా మెరుగ్గా ఉంది. ఇక దక్షిణాసియాలో చిన్న చిన్న దేశాలతో పోల్చుకుంటే బంగ్లాదేశ్‌ జనాబా ఎక్కువ. బంగ్లాదేశ్‌లో కూడా అంతర్గత జాతులు, మతాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయినా తలసరి ఆదాయంలో భారత్‌, పాకిస్తాన్‌ను వెనక్కి నెటి దక్షిణాసియాలో తానే ప్రాంతీయ లీడర్‌గా నిరూపించుకుంది బంగ్లదేశ్‌. అయితే ఈ ఏడాది తలసరి ఆదాయంలో భారత్‌ను కూడా వెనక్కి నెట్టింది బంగ్లాదేశ్‌. అఫ్తానిస్తాన్‌తో పోల్చుకుంటే  బంగ్లాదేశ్‌ కూడా రాజకీయంగా అతలాకుతలమైంది. అయితే ఆర్థికవేత్తలు మాత్రం ఏ దేశమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే రాజకీయ సుస్థిరత ఉండాలని చెబుతుంటారు. రాజకీయ సుస్తిరత.. ఆర్థిక అభివృద్ది రెండు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి.


 

ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంటే రాజకీయ సుస్థిరత ఎంతైనా అవసరం. ఇక అఫ్గానిస్తాన్‌ విషయానికి వస్తే రాజకీయ సంక్షభం కంటే ఆర్థిక సంక్షోభమే ఎక్కువగా ఉంది. రాజకీయ నిపుణులు మాత్రం అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుతం సంక్షోభానికి పలు ఆర్థిక అంశాలతో పాటు ఇతర అంశాలు జతకూడాయని చెబుతున్నారు.. దేశ ఆర్తిక వ్యవస్థపై పాలకులు పెద్దగా దృష్టి పెట్టలేదు. ప్రభుత్వ పాలకులు తమ దేశాన్ని ఆర్థికంగా ఎలా బలోపేతం చేసుకోవాలో పెద్దగా శ్రద్ధచూపలేదు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు దిగజారుతూ వచ్చింది. అయితే అఫ్గానిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ గురించి ఇతమిద్దంగా లేదా ఖచ్చితమైన సమాచారం కూడా అందుబాటులో లేకుండా పోయింది. 

ఇక ఆఫ్గానిస్తాన్‌ లో పేదరికం  చాలా చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఇలాంటి వారిని ఏరికోరి తాలిబన్లు తమ సైన్యంలో చేర్చుకున్నారు. కోవిడ్‌ 19 వచ్చినప్పుడు పాకిస్తాన్‌లో దారిద్ర్యరేఖకు దిగువన 24 శాతం జనాభా ఉంది. అటు తర్వాత కొన్ని నెలల తర్వాత అంటే కోవిడ్‌ -19 మహమ్మారి తర్వాత పాక్‌లో మళ్లీ పేదరికం గణాంకాలను విడదుల చేశారు. కరోనా తర్వాత పేదరికం 33 శాతం పెరిగింది. 30 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఇక భారత్‌ విషయానికి వస్తే దక్షిణాసియాలో అత్యధికంగా పేదలున్నారు. దారిద్ర్యరేఖకు దిగువన 34.6 కోట్ల మంది ఉన్నట్లు లెక్క. జనాభా ప్రతిపదికన చూస్తే 28 శాతంగా లెక్క తేలింది. ఇక అఫ్గానిస్తాన్‌ జనాభావిషయానికి వస్తే పాకిస్తాన్‌తో పోల్చుకుంటే 20 శాతం తక్కువ. అక్కడ పేదరికం 47.3 శాతంగా ఉంది. కరోనా తర్వాత పేదరికం మరింత పెరిగి ఉంటుంది.


అఫ్గానిస్తాన్‌లో పేదరికంలో మగ్గిపోవడానికి ప్రధాన కారణం. ఉపాధి రంగంలో మహిళల పాత్ర అతి తక్కువ. అలా అని దక్షిణాసియాలో ఉపాధి రంగంలో మహిళల పాత్ర చాలా తక్కువ. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలంటే భారత్‌తో పాటు అఫ్గానిస్తాన్‌లో పరిస్థితి పెద్ద గొప్పగా ఏమీలేదు. భారత్‌ విషయానికి వస్తే జనాభాలో కేవలం 21 శాతం మంది మాత్రమే ఉపాధి రంగంలో ఉంటే ఆఫ్గానిస్తాన్‌లో కేవలం 16 శాతం మాత్రమేఉన్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే పాకిస్తాన్‌లో మహిళలకు పెద్దగా హక్కులు లేదని ప్రపంచం భావిస్తుంటుంది. కానీ ఇక్కడి జనాభాలో 25 శాతం మంది మహిళలు ఉపాధిరంగంలో ఉన్నారు. అయితే అభివృద్ది చెందిన దేశాలతో పోల్చుకుంట చాలా తక్కువనే చెప్పాలి.  అయితే దక్షిణాసియాతో పోల్చుకుంటే పాకిస్తాన్‌లో పరిస్థితి కాస్తా మెరుగ్గా ఉంది. 


 

ఇక ప్రజారోగ్యం విషయానికి వస్తే.. ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ఖర్చు చేయడం లేదు. ఆఫ్గాన్‌లో ప్రజల జీవన ప్రమాణం 60 ఏళ్లు కాగా మహిళలు 68 ఏళ్ల వరకు బతుకుతారు. ఆఫ్గాన్‌లో వైద్య ఖర్చులను ప్రజలు తమ జేబుల్లోంచి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. శిశు మరణాల విషయానికి వస్తే 1,000 మందిలో46.5 శాతం మంది మరణిస్తారు.అదే పాకిస్తాన్‌లో 55.7 శాతంగా ఉంది. అదే భారత్‌లో 28.3 శాతం, బంగ్లదేశ్‌లో 25.6 శాతంగా ఉంది. ఆఫ్గానిస్తాన్‌ జీడీపీ 20 బిలియన్‌ డాలర్లు  బడ్జెట్‌లో 15 శాతం వరకు విద్యపై వ్యయం చేస్తోంది. అయితే రక్షణ రంగానికి చేసే వ్యయం కంటే విద్యపనే వ్యయం చేయడం ఆసక్తికరమైన అంశం. ఇంత చేసినా 29 శాతం మంది మహిళలు, 55 శాతం మంది పురుషులు 15 ఏళ్లు దాటిన వారే అక్షరాస్యులు. అతి తక్కువ జీడీపీ అంటే 20 బిలియన్‌ డాలర్ల జీడీపీని చూస్తే దేశం ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో తెలిసిపోతోంది. జనాభా లో యువత అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. ఉదారణకు వ్యసాయరంగంపై ఆధారపడి పనిచే్స్తున్నారు. ఈ రంగం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఒకగూడే ప్రరయోజనం కూడా పెద్దగా ఒనగూడదు. అందువల్లే ఇక్కడి ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు.  ప్రస్తుతం అమెరికా దేశం నుంచి నిష్ర్కమించింది. కొత్తగా పగ్గాలు చేపట్టిన తాలిబన్ల చేతిలో అక్కడి ప్రజలు ఆర్థికంగా బలపడుతారా లేక మరింత పాతాళంలోకి కూరుకుపోతారా అనేది కాలమే చెప్పాలి.

రచయిత-లక్కాకుల కృష్ణమోహన్‌

సీనియర్‌ జర్నలిస్టు...హైదరాబాద్

సెల్‌ నెం 9705472099

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: