నాడు నేడు తో విప్లవాత్మక మార్పులు

మునగాల చంద్రశేఖర్ రెడ్డి 

(జానో జాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యములో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన పిల్లల చదువుల కోసం ఈతరం, వచ్చేతరం పిల్లలు ప్రపంచంలో పోటీకి నిలబడి ఎదిగేందుకు అవసరమైన వాతావరణాన్ని విద్యారంగంలో నెలకొల్పారు. అందులో భాగంగానే గవర్నమెంటు స్కూల్‌ను కార్పొరేట్‌ స్కూళ్ళకు దీటుగా తీర్చిదిద్దే విధంగా నాడు–నేడు కార్యక్రమము ద్వారా రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్‌ పాఠశాలలు, కాలేజీల రూపురేఖల్ని మారుస్తున్నారని, 

 


జగనన్న విద్యా కానుక ద్వారా గవర్నమెంటు స్కూళ్ళలో బడులు తెరిచిన రోజే పిల్లలకు కుట్టుకూలితో సహా మూడు జతల యూనిఫాంలు, స్కూల్‌ బ్యాగ్‌, బైలింగ్యువల్‌ టెక్స్ట్ బుక్స్, నోట్‌ బుక్స్, వర్క్‌ బుక్స్, బెల్టు, షూస్, సాక్సులు... వీటితోపాటు ఇంగ్లీష్ - తెలుగు డిక్షనరీ... ఇవన్నీ ఉచితంగా అందిస్తున్నాం. మార్చిన మెనూ ద్వారా పిల్లలకు వారంలో ప్రతి రోజూ వేర్వేరు ఆహార పదార్థాలతో... అన్నం, పప్పుచారు, ఆకుకూర పప్పు, చిక్కీ, ఎగ్‌కర్రీ, పులిహోర, టొమేటో పప్పు, ఉడికించిన గుడ్డు, కూరగాయల అన్నం, కిచిడీ, చట్నీ వంటి ఆహార పదార్థాలతో... రోజుకు ఒక మెనూతో... జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తున్నాం.

జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా, రాబోయే తరం అవసరాలను దృష్టిలో ఉంచుకుని బడుల్లో మార్పులు చేస్తున్నారని, 

ప్రభుత్వ స్కూళ్ళను సీబీఎస్‌ఈ ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్ళుగా మారుస్తూ. ఫీజుల నియంత్రణతోపాటు, విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్‌ దోపిడీకి నియంత్రణ కమిషన్ల ఏర్పాటు ద్వారా అడ్డుకట్ట వేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ, డివై ఎస్పి,  మున్సిపల్ చైర్మన్  తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిధులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.


 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: