వెలిగొంగ ప్రాజెక్టును...

జల శక్తి సంఘం గజిట్ లో చేర్చే విధంగా

కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలి

మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

తెలుగుదేశం పార్టీ మాజీ శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి, మార్కాపురం నియోజక వర్గం

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

వెలిగొంగ ప్రాజెక్టును కేంద్ర జల శక్తి సంఘం గజిట్ లో చేర్చే విధంగా బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజక వర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగినది. ఈ సమావేశం అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. మాజీ శాసన సభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు ను తక్షణమే కేంద్ర జల శక్తి సంఘం గజిట్ లో చేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. మాట్లాడుతూ  పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు శ్రీశైలంలో 803 అడుగులకే నీటి తరలింపు చేపట్టవచ్చును అని అదే వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీశైలం ద్వారా నీటిని తరలించడం 843 అడుగుల నీటి మట్టం ద్వారా మాత్రమే సాధ్యమని  తద్వారా ప్రకాశం జిల్లా రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని తెలిపారు.


దీనికి నిరసనగా వచ్చే సోమవారం నుండి 5 మండలాల పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఒక్కొక్క రోజు ఒక్కో మండలం నుండి కార్యకర్తలు మార్కాపురం లోని ఆర్డీవో ఆఫీస్ ఎదుట నిరాహార దీక్ష చేపడుతున్నామని తెలియజేశారు. దీని తర్వాత మార్కాపూర్ నియోజకవర్గం లో వైసీపీ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని దీనిపై త్వరలో ప్రజలతో కలసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు .ఈ సమావేశంలో ఒంగోలు పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, తెలుగుదేశం జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, సమన్వయ కమిటీ సభ్యులు కాటూరి పెద్ద బాబు,  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్, తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటరీ ఉపాధ్యక్షులు కంచర్ల కాశయ్య, ఒంగోల్ పార్లమెంటరీ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రసూల్, ఒంగోలు పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి ఎర్రం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ఒంగోలు పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పొల్లా  నరసింహారావు, మార్కాపురం మాజీ ఏఎంసి చైర్మన్ కాకర్ల శ్రీనివాసులు, పొదిలి ఏ ఎం సి మాజీ చైర్మన్ సిహెచ్ రామలింగయ్య, మార్కాపూర్ రూరల్ అధ్యక్షులు జవ్వాజి రామానుజుల రెడ్డి, తర్లుపాడు మండల పార్టీ అధ్యక్షులు ఉడుముల చిన్నపరెడ్డి, కొనకనమిట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కనకం నరసింహారావు, పొదిలి మండల పార్టీ అధ్యక్షులు మీగడ  ఓబుల్ రెడ్డి, పొదిలి పట్టణ అధ్యక్షులు ముళ్ళ, కుద్దుస్ సమన్వయ కమిటీ సభ్యులు శనిగ నాసర్ రెడ్డి, పులి వేముల ఏసు దాసు, మంద వెంకట రెడ్డి, సదాం  వీరయ్య, వై వెంకటనారాయణ చౌదరి, ఏరువ వెంకట నారాయణ రెడ్డి, కొప్పుల శ్రీనివాసులు, మైనారిటీ నాయకులు పటాన్ ఇబ్రహీం, గులాబ్ తదితరులు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: