*జాతీయ జెండా నియమాలు...!*
జెండా విశేషాలు
*🇮🇳2002 లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్ లోని ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నవి...*🇮🇳
జెండా ఎగురవేయడంలో నియమాలు తెలిసో తెలియకో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నవి.కాగా రాజ్యాంగా స్పూర్తికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం కూడా జరుగుచున్నది...*
*🇮🇳Flag code of India సెక్షన్ V రూల్ ప్రకారం రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సంధర్భంగా జెండాలో పూలుపెట్టి ఎగుర వేయవచ్చు...*
*జెండా ఎవరు ఎగుర వేయాలనేది ఒక సమస్య...*
1.👉విధాన నిర్ణాయక సంస్థలు,(బాధ్యులు ప్రధాని,ముఖ్యమంత్రి, ZP చైర్మెన్,గ్రామ సర్పంచ్ మొదలగు వారు)
2.👉కార్యనినిర్వహణ సంస్థలు.(రాష్ట్రపతి, గవర్నర్ కలెక్టర్ MDO, MEO.MRO హెడ్ మాష్టర్ ప్రిన్సిపాల్) అనేవి ఈ విధంగా రెండు రకాలు. మనం కార్యనిర్వహణ సంస్థల క్రిందకు వస్తాము. కార్యనిర్వాహకులం...
👉పాఠశాలలు, కాలేజీలు కార్యనిర్వహణ సంస్థలు. కావున పాఠశాల్లో 15 ఆగష్టు, 26 జనవరిలనందు ప్రధానోపాధ్యాయులే జాతీయ జెండాను ఎగుర వేయాలి...
*🇮🇳సాధారణ నియమాలు...!*
1.👉జాతీయ జెండా చేనేత ఖాది,కాటన్ గుడ్డతో తయారైనది ఉండాలి.
2.జెండా పొడవు 3:2 నిష్పత్తిలో ఉండాలి. 6300x4200 మి.మీ. నుండి 150x100 మి.మీ.వరకు మొత్తం 9 రకాలుగా పేర్కోనడం జరిగింది.
3👉.ప్లాస్టిక్ జెండాలు అసలే వాడరాదు.
4.👉పై నుండి క్రిందకు 3 రంగులు సమానంగా ఉండాలి.
5.👉జెండాను నేలమీదగాని, నీటి మీద పడనీయరాదు.
6👉.జెండాపై ఎలాంటి రాతలు,సంతకాలు, ప్రింటింగులు ఉండరాదు.
7.👉జెండా ఎప్పుడూ నిటారుగా ఉండాలి.కిందికి వంచకూడదు.
8.జెండాను వడిగా,(వేగంగా) ఎగురవేయాలి.
9.👉జెండాను ఎగురవేయడం ,మరియు దించడం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపున చేయాలి.
10.👉జెండా మధ్యలోని ధర్మచక్రంలో 24 ఆకులుండాలి.
11.👉జెండా పాతబడితే తుడుపు గుడ్డగా మాత్రం ఎట్టి పరిస్థితులలో ఉపయోగించరాదు. అది నేరం..దానిని కాల్చివేయాలి.ఎక్కడంటే అక్కడ పడ వేయరాదు.
12.👉ఒకవేల వివిధ రకాల జెండాల పక్కన ఎగుర వేయవలసి వచ్చినచో జాతీయ జెండా మిగతా వాటికంటే ఎత్తుగా ఉండాలి..
13.👉జెండాను ఎగుర వేయునపుడు జాతీయనాయకుల ఫోటోలు ఉంచాలి.
14.👉జెండాను ముందుగా 1,2 సార్లు పరిశీలించుకోవాలి. ఎక్కించి దించడం, మరల ఎక్కించడం చేయరాదు.
15.👉కావున భారత భావి పౌరులను తీర్చిదిద్ధాల్సిన ఉపాధ్యాయులం మనం. జెండా వందనాన్నీ నియమ నిష్టలతో, నిబద్ధతతో, నియమాలతో చేయాలి.
16.👉జెండా పోల్ నిటారుగా ఉండాలి.వంకరగా ఉండరాదు.కొన్ని సార్లు విరిగిన సంధర్భాలు జరిగినవి.జాగ్రత్త వహించాలి.
17.👉విద్యార్థుల జేబులకు ఉంచే చిన్న జెండాలు కింద ఎక్కడంటే అక్కడ పడ వేయనీయరాదు. వాటిని తొక్కనీయరాదు.వాటిని వీలయితే అన్ని ఏరి కాల్చి వేయాలి. పిల్లలకు తప్పని సరిగా జెండా నియమాలు చెప్పి పాటింప చేయాలి.జాతీయ గేయం పాడునపుడు పాటించే నియమాలు చెప్పాలి.
18.👉వీలైనంత వరకు పురికోసలకు కట్టే పరారలకు త్రివర్ణ పతాకాలను (చిన్నవి) అతికించరాదు.రంగు రంగుల కాగితాలు మాత్రమే అతికించాలి.రెడీమేడ్ ప్లాస్టిక్ వి త్రివర్ణ పతాకాలు కడుతున్నాం వాటిని కూడా వాడరాదు
*భారత జాతీయ పతాకంలో గల అశోక చక్రం దాని వివరాలు:*
*👉అశోకచక్రం, ధర్మచక్రం ఇందులో 24 ఆకులు (స్పోక్స్) గలవు.*
*👉అశోక చక్రవర్తి (273 - 232 క్రీ.పూ.) పరిపాలనా కాలంలో తన రాజధానియగు సారనాథ్ లోని అశోక స్థంభం యందు ఉపయోగించాడు.*
*👉నవీన కాలంలో ఈ అశోకచక్రం, మన జాతీయ పతాకంలో చోటుచేసుకున్నది. దీనిని 1947 జూలై 22 న, పొందుపరచారు.*
*👉ఈ అశోకచక్రం, తెల్లని బ్యాక్-గ్రౌండ్ లో ' నీలి ఊదా' రంగులో గలదు.*
*👉ప్రఖ్యాత 'సాండ్ స్టోన్' (ఇసుకరాయి) లో చెక్కబడిన 'నాలుగు సింహాల' చిహ్నం.సారనాథ్ సంగ్రహాలయంలో గలదు.*
*👉ఇది అశోక స్థంభం పైభాగాన గలదు.*
*👉దీని నిర్మాణ క్రీ.పూ. 250 లో జరిగినది. భారత ప్రభుత్వము, దీనిని తన అధికారిక చిహ్నంగా గుర్తించింది.*
*🇮🇳డిజైను వెనుక గల చరిత్ర మరియు కారణాలు.*
_*🇮🇳ఈ అశోకచక్రం, అశోకుడి కాలంలో నిర్మింపబడినది.*_
*'చక్ర' అనేది సంస్కృత పదము, దీనికి ఇంకో అర్థం, స్వయంగా తిరుగుతూ, కాలచక్రంలా తన చలనాన్ని పూర్తిచేసి మళ్ళీ తన గమనాన్ని ప్రారంభించేది 'గుర్రం' ఖచ్చితత్వానికీ మరియు 'ఎద్దు' కృషికి చిహ్నాలు.*
_*👉ఈ చక్రంలో గల*_
24 ఆకులు (స్పోక్స్),
24 భావాలను సూచిస్తాయి.
1. ప్రేమ (Love)
2. ధైర్యము (Courage)
3. సహనం (Patience)
4. శాంతి (Peacefulness)
5. కరుణ (kindness)
6. మంచి (Goodness)
7. విశ్వాసం (Faithfulness)
8. మృదుస్వభావం (Gentleness)
9. సంయమనం (Self-control)
10. త్యాగనిరతి (Selflessness)
11. ఆత్మార్పణ (Self sacrifice)
12. నిజాయితీ (Truthfulness)
13. సచ్ఛీలత (Righteousness)
14. న్యాయం (Justice)
15. దయ (Mercy)
16. హుందాతనం (Graciousness)
17. వినమ్రత (Humility)
18. దయ (Empathy)
19. జాలి (Sympathy)
20. దివ్యజ్ఞానం (Godly knowledge)
21. ఈశ్వర జ్ఞానం (Godly wisdom)
22. దైవనీతి (దివ్యనీతి) (Godly moral)
23. దైవభీతి (దైవభక్తి) (Reverential fear of God)
24. దైవంపై ఆశ/ నమ్మకం/ విశ్వాసం
(Hope/ trust/ faith in the
goodness of God.)
*👉భారతీయ పాఠ్యపుస్తకాల అనుసారం,*
*🇮🇳ఈ ఇరవైనాలుగు ఆకులు (స్పోక్స్), 🇮🇳 24 గంటలూ భారత ప్రగతిని సూచిస్తాయి...*
*🇮🇳 జై...హింద్...🇮🇳*మేరా భారత్ మహాన్
సేకరణ కర్త ....ఉమర్ ఫారూఖ్ ఖాన్
ముస్లిం నగారా &టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్
జాతీయ అధ్యక్షుడు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Home
Unlabelled
జాతీయ జెండా నియమాలు... జెండా విశేషాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: