పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

టీడీపీ నేతల డిమాండ్


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని టీడీపీ నేతల డిమాండ్ చేశారు. సోమవారంనాడు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం నియోజక వర్గ   ఇన్ చార్జ్, మాజీ ఎం.ఎల్.ఎ. కందుల నారాయణ రెడ్డి ఆదేశానుసారం మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల ,పొదిలి మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, ఒంగోలు పార్లమెంటరీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం ఆధ్వర్యములో “ హైకోర్టు తీర్పు ననుసరించి ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను “ తక్షణమే చెల్లించాలని సంబంధిత మండల అభివృద్ధి అధికారికి వినతి పత్రమును అందజేశారు .ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ముఖ్యంగా పలు మండలాలలో ఉపాధి కూలీలపై చూపుతున్న కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్ల వ్వవహారశైలిపై దృష్టి పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమములో మండల రూరల్ పార్టీ అధ్యక్షుడు జవాజి రామానుజుల రెడ్డి, మాజీ ఎం సి చైర్మన్ కాకర్ల శ్రీనివాసులు, పఠాన్ ఇబ్రహీం, పెద్ద అక్క తదితర తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. తర్లుపాడు మండలం లో ల జిల్లా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు కంచర్ల కాశయ్య, మాజీ ఎంపీపీ  ఏసుదాసు, మాజీ ఎంపిటిసి గోపీనాథ్ చౌదరి, gosu వెంకటేశ్వర్లు, వెంకట్ రెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు .కొనకనమిట్ల మండలం లో పార్టీ అధ్యక్షులు కనకం నరసింహారావు, ఏఎంసి పొదిలి మాజీ చైర్మన్ సిహెచ్ రామలింగయ్య, మాజీ పార్టీ అధ్యక్షులు వి.వి.వి రామ్ రెడ్డి, బాబురావు, శ్రీకాంత్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. పొదిలి మండలం లో పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు రసూల్, పొదిలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముళ్ల ఖుద్దూస్, టీఎన్ఎస్ఎఫ్ ఒంగోలు పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌస్ భాష, తెలుగుదేశం నాయకులు షేక్ ఇమాంసా తదితర నాయకులు పాల్గొన్నారు.


 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: