అగ్రిగోల్డ్ బాధితులకు రెండో దశ చెల్లింపులకు

కార్యచరణ సిద్దం


(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

     అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ కార్యాచరణకు సిద్దమైంది.  గతంలో ఇప్పటికే పదివేలా రూపాయాలలోపు డిపాజిట్ చేసిన వారికి ప్రభుత్వం ఆ మొత్తాలను చెల్లించింది. తాజాగా పదివేలా రూపాయాల నుంచి ఇరవై వేలా రూపాయాలలోపు డిపాజిట్ దారులను ఆదుకోవాలని నిర్ణయించింది. ఈ మొత్తాలను సంబంధిత డిపాజిట్ దారుల ఖాతాలలో ఈ నెల 24వ తేదిన జమ చేయనున్నారు. కావున డిపాజిట్ దారులు సంబంధిత చెక్కు, పే ఆర్డర్,  రశీదులు, బ్యాంకు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు వివరాలను తమ గ్రామ/వార్డు వాలంటీర్ల వద్ద నమోదు చేయించుకోవాలని సిఐడి విభాగం ఒక ప్రకటనలో తెలిపారు.


విధి విధానాలు:-

    కోర్టు పేర్కొన్న జాబితా ప్రకారం చెల్లింపులు జరుగుతాయి.

     డిపాజిట్ దారులకు రావల్సిన నగదును వారి బ్యాంకు ఖాతాలలో మాత్రమే జమా చేస్తారు. 

    ఒక డిపాజిట్దారుడు ఒక క్లైయిమ్ కే అర్హుడు.

     చనిపోయిన డిపాజిట్ దారుల డిపాజిట్ మొత్తాలను వారి చట్టబద్ధ సంబంధికుల బ్యాంకు ఖాతాలలో జమా చేస్తారు. కాబట్టి సంబంధిత వారు లీగల్ హైర్ సర్టిఫికెట్ సమర్పించాలి. 

      ఏమైనా సందేహాలు వుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-3875 సంప్రదించండి.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: