వెలిగొండ ప్రాజెక్ట్ పై ... ప్రభుత్వ  వైఖరికి నిరసనగా

టీడీపీ దీక్ష.. హాజరైన సీనియర్ నాయకులుు

  ( జానో - జాగో వెబ్ న్యూస్ -  మార్కాపురం ప్రతినిధి)

      ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో                     ఈరోజు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పై ఈ రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి చేస్తున్న నిరాహార దీక్ష ఐదవ రోజు ముగింపు సభ నిర్వహించారు. ఈ దీక్షకు సంఘీభావంగా మాజీ మంత్రివర్యులు  ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ,  బాపట్ల పార్లమెంటు పార్టీ అధ్యక్షులు మరియు పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ,  కనిగిరి మాజీ శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గిద్దలూరు మాజీ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ,  సంతనూతలపాడు మాజీ శాసనసభ్యులు బి.ఎన్ విజయ్ కుమార్ , ఎర్రగొండపాలెం టిడిపి ఇంచార్జ్ శ   గూడూరి ఎరిక్సన్ బాబు  విచ్చేసి సంఘీభావం ప్రకటించి మార్కాపురం మాజీ శాసనసభ్యులు            కందుల నారాయణ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లాలలో ఒకటైన ప్రకాశం జిల్లాకు వరప్రదాయని అయిన ఈ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఒక్క ప్రకాశం జిల్లాకే కాక నెల్లూరు మరియు కడప జిల్లాకు సైతం నాలుగు లక్షల 38 వేల ఎకరాలకు సాగు నీరు 15 లక్షల మందికి త్రాగు నీరు అందించగల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ను  ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 42 టీఎంసీల నికర జలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఈ  రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పై విపరీత నిర్లక్ష ధోరణి తో వ్యవహరిస్తున్నారు అని దానికి ఉదాహరణ ఇటీవల పులిచింతల ప్రాజెక్టు గేట్ కొట్టుకొనిపోయి 40 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిందని తెలియజేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జల శక్తి సంఘ గెజిట్ లో శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ను గుర్తించక పోయినా ఈ జిల్లా మంత్రులకు గాని ఈ జిల్లా శాసనసభ్యులకు గాని చీమ కుట్టినట్లయినా లేదని కనీస ప్రతిస్పందన కూడా వ్యక్తం చేయలేదని ఓట్లు వేయించుకొని ప్రకాశం జిల్లా ప్రజలను మభ్యపెడుతూ ప్రజల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వారు మాట్లాడుతూ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ తక్షణమే కేంద్ర జల శక్తి సంఘం గెజిట్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ టన్నెల్ పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆర్ ఆర్ ప్యాకేజీని అమలు చేసి రైతులకు చెల్లించవలసిన 1,400 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

తద్వారాారా పూర్తయిన మొదటి టన్నెల్ ద్వారా సంబంధిత ఆయకట్టుకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఉద్యమం ఇప్పుడే మొదలైందని భవిష్యత్తులో ప్రజల భాగస్వామ్యంతో ఈ ఉద్యమమును తీవ్రరూపం దాలుస్తుందని తెలిపారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బడ్జెట్లో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించి త్వరితగతిన ప్రాజెక్ట్ను పూర్తిచేయాలని నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఒంగోలు పార్లమెంటు పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్య నారాయణ , జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, ఒంగోల్ పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు కంచర్ల కాశయ్య , ఒంగోలు పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి    పోల్ల నరసింహారావు, తర్లుపాడు మండల పార్టీ అధ్యక్షులు ఉడుముల చిన్నప్ప రెడ్డి, మార్కాపూర్ం మండల పార్టీ అధ్యక్షులు రామానుజుల రెడ్డి , కొనకనమిట్ల మండల పార్టీ అధ్యక్షులు కనక నరసింహారావు ,  పొదిలి మండల పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి ,  జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రసూల్ ,,

 


పొదిలిిలి పట్టణ అధ్యక్షుడు ముల్లా ఖుద్దూస్, మాజీ ఎంపీపీ ఏసుదాసు ,  తెలుగుదేశం నాయకులు కొప్పుల శ్రీను ,  పటాన్ ఇబ్రహీం, పి గోపీనాథ్ చౌదరి , సాదం  వీరయ్య ,  తాండ్ర  వెంకటేశ్వర్లు,  కౌన్సిలర్లు ఏరువ వెంకట నారాయణ రెడ్డి , నాలి  కొండయ్య ,  మల్లికార్జున , చిలకపాటి పొట్టి చెన్నయ్య, తెలుగుదేశం మహిళా నాయకురాలు పోరుమామిళ్ల విజయలక్ష్మి ,  చెన్న లక్ష్మి , మల్లికా సయ్యద్, పెద్దక్క,  పెద్దారవీడు మండల తెలుగుదేశం  నాయకులు గొట్టం శ్రీనివాస రెడ్డి ,  మార్కాపూర్ పట్టణ మార్కాపూర్ం మండలం  తెలుగుదేశం నాయకులు,  కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని దీక్ష కు సంఘీభావం తెలియజేశారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: