వాలంటీర్ వద్ద కూడా,,,

ఈ-కేవైసీ నమోదు చేయించుకోవచ్చు

అందరూ ఆధార్ కేంద్రాలకు క్యూ కట్టాల్సిన అవసరం లేదు

సివిల్ సప్లైస్ కమీషనర్ కోన శశిధర్


పౌరసరఫరాల శాఖా కమీషనర్ కోన శశిధర్

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ/వార్డు సచివాలయాలనూ ఆధార్ నమోదు కేంద్రాలుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని సివిల్ సప్లైస్ కమీషనర్ కోన శశిధర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, జాతీయ ఆహార భద్రత చట్టం మేరకు రేషన్ కార్డు ద్వారా కార్డుదారులు దేశంలో ఎక్కడైనా నిత్యావసర సరుకులను తీసుకునే హక్కు పొందడం కోసం బియ్యం కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ చేయించుకోవడం తప్పనిసరని, అయితే ఈ-కేవైసీ కోసం బియ్యం కార్డుదారులు ఆధార్ కేంద్రాల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రతి గ్రామ/వార్డు వాలంటీర్ వద్ద ఉన్న బయోమెట్రిక్ యంత్రం ద్వారా కాని లేదా రేషన్ షాప్ డీలర్ వద్ద ఉన్న ఈ-పోస్ యంత్రం ద్వారా కానిబియ్యం కార్డు దారులు తమ నివాస ప్రాంతాల్లోనే సులభంగా ఈ-కేవైసీ చేయించుకోవచ్చని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ కోన శశిధర్ తెలిపినట్లు గురువారం నాడు విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటన ద్వారా రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ వివరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి.

ఈ-కేవైసీ కోసం ఆధార్ కేంద్రాల వద్ద జనం క్యూ కడుతున్నారని, గడువు ముగుస్తోందని, బియ్యం కట్ అని మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున ఈ-కేవైసీ పై ప్రజలకు మీడియా ద్వారా అవగాహన కల్పించే సంకల్పంతో, ఈ-కేవైసీ పై బియ్యం కార్డుదారులకు ఉన్న అపోహలను, అనుమానాలను నివృత్తి చేసే విధంగా కోన శశిధర్ ఈ-కేవైసీ పై తెలిపిన అంశాలపై  సంగ్రహ సమాచారంతో ఐ&పీఆర్ కమీషనర్ పత్రికా ప్రకటన విడుదల చేసారు.

పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి (నాని)  వెంకటేశ్వరరావు.

ఈ-కేవైసీ( eKYC) అంటే ఏమిటి..?

# కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం, జాతీయ ఆహార భద్రత చట్టం మేరకు రాష్ట్రంలోని బియ్యంకార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు/సభ్యురాలు ఈ-కేవైసీ చేయించుకోవాలి

# బియ్యం కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బయోమెట్రిక్ యంత్రం ద్వారా వారి వేలిముద్రలతో ఆధార్ నెంబర్ ను ధ్రువీకరించుకునే సింపుల్ ప్రక్రియ ఈ-కేవైసీ

ఈ-కైవైసీ వల్ల ప్రయోజనాలేమిటి..?

# కేంద్ర ఆహార భద్రత చట్టం ప్రకారం ఈ-కేవైసీ చేయించుకున్న  బియ్యంకార్డు/నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్టు కార్డుదారులు పోర్టబిలిటీ సదుపాయం ద్వారా ప్రతి సభ్యులు వ్యక్తిగతంగా నిత్యావసర రేషన్ సరుకులను దేశంలో ఎక్కడినుండైనా పొందే హక్కు కలుగుతుంది. ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందడానికి కూడా వీలు కలుగుతుంది.

ఈ-కేవైసీ ని ఎక్కడ..ఎవరితో..ఎలా చేయించుకోవాలి..?

# ఈ-కేవైసీ ప్రక్రియను చాలా సులభతరంగా...మీ గ్రామ/వార్డు వాలంటీర్ వద్ద ఉన్న బయోమెట్రిక్ యంత్రం ద్వారా  చేయించుకోవచ్చు

# లేదా మీ చౌక ధరల దుకాణపు డీలర్ వద్ద ఉన్న ఈ-పోస్(ePOS) యంత్రం ద్వారానైనా ఈ-కేవైసీ చేయించుకోవచ్చు

# వేలి ముద్రలు సరిగా పడని వారు వారి చౌక ధరల దుకాణం వద్ద ఈ-పోస్ యంత్రం ద్వారా ఫ్యూజన్ ఫింగర్( FUSION FINGER) సదుపాయాన్ని వినియోగించుకుని ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తీ చేసుకోవచ్చు 

# వాలంటీర్ వద్ద ఉన్న బయోమెట్రిక్ యంత్రం వద్ద కానీ లేదా చౌక ధరల దుకాణం వద్ద ఉన్న ఈ-పోస్ యంత్రం వద్ద కానీ ఈ-కేవైసీ ఫెయిల్ అయిన వారు మరియు ఇదివరకు బయోమెట్రిక్ రికార్డు కాని వారు మాత్రమే ఆధార్ నమోదు కేంద్రాల వద్దకు వెళ్లి ఈ-కేవైసీ చేయించుకోవచ్చు 

# ఈ-కేవైసీ చేయించుకోవాల్సిన వారిలో దాదాపు 80 శాతం మంది గ్రామ/వార్డు వాలంటీర్ ద్వారా ఈ-కేవైసీ పూర్తీ చేయించుకోవచ్చు 

ఈ-కేవైసీ ఎవరికి అవసరం..ఎంత గడువులోపు పూర్తీ చేయించుకోవాలి?

# బియ్యం కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ చేయించుకోవాలి

# అయితే 0-5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఈ-కేవైసీ అవసరం లేదు

# 5 నుండి 15 సంవత్సరాల వయసు ఉన్న వారికి వచ్చే నెల సెప్టెంబర్ ఆఖరు లోపు ఈ-కేవైసీ చేయించుకోవాలి

# మిగిలిన వయసు వారు ఈనెల ఆఖరు లోపు ఈ-కేవైసీ చేయించుకోవాలి

# పరిస్థితిని బట్టి గడువు పొడిగింపు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది

ఆధార్ నమోదు కేంద్రాలుగా గ్రామ/వార్డు సచివాలయాలను గుర్తించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం

# రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ/వార్డు సచివాలయాలనూ ఆధార్ నమోదు కేంద్రాలుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది

# ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 2102 ఆధార్ నమోదు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి

బియ్యం కార్డుల రద్దుపై అనుమానాలు..అపోహలు వద్దు 

# ఈ-కేవైసీ ప్రక్రియ బియ్యం కార్డులను తొలగించే ప్రక్రియ కాదు - ఇది కేవలం ఆధార్ ద్వారా వ్యక్తిగత ధ్రువీకరణ మాత్రమే

#కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, జాతీయ ఆహార భద్రత చట్టం మేరకు బియ్యం కార్డులో ఈ-కేవైసీ పూర్తి చేసుకున్న ప్రతి సభ్యునికీ/సభ్యురాలికీ నిరంతరాయంగా రేషన్ సరుకులను యథావిధిగా సరఫరా చేయడం జరుగుతుందని, అపోహలను, అనుమానాలను విడనాడి, పుకార్లను నమ్మకుండా బియ్యం కార్డుదారుల్లో అక్కడక్కడా ఇంకా ఈ-కేవైసీ చేసుకోని వారు ఎవరైనా ఉంటే పైన తెలిపిన గడువు లోపు ఈ-కేవైసీ చేయించుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ కోన శశిధర్ విజ్ఞప్తి చేశారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: