మేము మూర్ఖులమే మరి!

వెలిగొండ పూర్తి చేయాలనుకునే ముర్ఖులం

వెలిగొండకు మీ హయాంలో ఏమి చేశారో ప్రజలకు  చెప్పండి 

వాదనలు ఎందుకు ? వాస్తవాలు వివరించండి.

టీడీపీ నాయకులకు వైసీపీ నేత డాక్టర్ ఏలూరి హితవు 

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

మేము మూర్ఖులమే మరి ! ఎంతగా అంటే వెనుకబడిన పశ్చిమ ప్రకాశం అభివృద్ధికి జీవనాదరమైన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి  క్రిష్ణ జలాలను ప్రజలకు అందించాలనే లక్ష్యంతో  వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి టిడిపి నాయకులకు చిరుకలంటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మూర్ఖులతో వాదించడం దండగ అని పేర్కొంటున్న టిడిపి నాయకులు చంద్రబాబు హయాంలో వెలిగొండ నిర్మాణానికి ఎంతమాత్రం చిత్తశుద్ధితో పనిచేశారో ప్రజలకు శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 
1996 వ సంవత్సరంలో మొక్కుబడిగా, కేవలం ఓట్ల కోసం అలాగే ప్రజలను మోసం చేసేందుకు నాడు చంద్రబాబు వెలిగొండకు శంకుస్థాపన చేసి అనంతరం గాలికి వదిలేశారని అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని డాక్టర్ ఏలూరి టీడీపీ నాయకులకు హితవుపలికారు. ప్రాజెక్టు నిర్మాణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృత నిశ్చయంతో వున్నారని, టీడీపీ మాటలను ప్రజలు ఎవరు విశ్వసించే స్థితిలో లేరని విమర్శించారు. వెలిగొండ పై  ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని అన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: