ఉన్మాదిలా వ్యవహరిస్తున్నాడు

బండి సంజయ్ ను కట్టడి చేయండి

డీజీపీకి కాంగ్రెస్ నేత  జి.నిరంజన్ లేఖ  

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

బండి సంజయ్ ఉన్మాదిలా విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని. ఆయన్ని కట్టడి చేయండి అంటూ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ కోరారు. ఈ మేరకు డీజీపీకి ఆయన ఓ లేఖ రాశారు. ఆ లేఖలోని సారాంశం ఇలావుంది. ఈ నెల 27 న పాదయాత్ర ప్రారంభించిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్మాదిలా, మత విద్వేషాలు రెచ్చగొట్టి, రాష్ట్రములో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వాఖ్యలు చేస్తున్నారు. ఆయనను కట్టడి చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూడాల్సిన భాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖది. హిందువుల గురించి ఎంతకైనా తెగిస్తా. పక్కా హిందూయిజాన్ని రగిలిస్తా. నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని మాట్లాడటం హిందువుల అభివృద్దికా? ఇతరులను రెచ్చగొట్టడానికా గమనించాలి. బండి సంజయ్ పాదయాత్ర పై మాకు అభ్యంతరం లేదు. ఉద్రిక్తత, రెచ్చగొట్టే మాటలు అనుమతించాలా లేదా డి.జి.పి ఆలోచించాలి. రాష్ట్రంలో మత సామరస్యము, శాంతి భద్రతలు కాపాడే భాద్యత డి.జి.పి పై ఉన్నది. ఈ రోజు పత్రికల్లో వచ్చిన వార్తలను డి.జి.పి కి పంపిస్తాము. నిజాం స్వయంగా పరమత సహనము కల్గిన వ్యక్తి. ఆయన పరంగా మత వివక్షతలు లేవు. కానీ రజాకార్ల విచ్చలవిడి తనాన్ని ఆయన అరికట్టలేకపోయారు. నిజాం మనవడు ప్రిన్ష్ ముఫ్ఫక్కమ్ జా 1999 లో ఒక పత్రిక లో వచ్చిన వార్తను చదివి నిజాం ట్రస్ట్ ఏనుగు హాష్మీ ని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి మందిర బోనాల ఊరేగింపుకు అనుమతించిన తీరు ఆ కుటుంబపు పరమత సహనానికి నిదర్శనం. ఆయన హయాంలో రాజాబహద్దూర్ వెంకట్రామరెడ్డి కొత్వాల్ గా రాజా కిషన్ ప్రసాద్, రాజా రావులు ఆయన కొలువులో ఉన్నత పదవులలో ఉన్న విషయం మరువద్దు. నిజాం రాచరికాన్ని , రజాకార్ల ఆగడాలను వ్యతిరేకిస్తూ 1938 లో ఏర్పడిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై నిజాం ప్రభుత్వం నిషేధం విధించిన విషయం బండి సంజయ్ కు తెలియక పోవచ్చు.  చైనా తో యుద్ధ సమయంలో అప్పటి ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి పిలుపు మేరకు నిజాం 5000 కె.జి ల బంగారం ఇచ్చిన విషయం బండి సంజయ్ కు బహుశా తెలియక పోవచ్చు. టి.అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయములో అల్లర్లు చెలరేగితే, మొన్న బండి సంజయ్ చార్మినార్ వద్ద మాట్లాడిన చోటనే ముఖ్యమంత్రి అంజయ్య బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి మజ్లిస్ నాయకులను గట్టిగా హెచ్చరించడమే కాకుండా మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు సుల్తాన్ సలాహుద్దీన్ తో సహా మజ్లీస్ శాసన సభ్యులను నగర బహిష్కరణ చేశారు. 2012 లో కూడా భాగ్యలక్ష్మి మందిర విషయములో గొడవ చేస్తున్న మజ్లిస్ శాసన సభ్యులను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇప్పటికయినా బండి సంజయ్ తన ధోరణి మార్చుకుని తన పార్టీ ప్రచారం చేసుకుంటే ఎవరికీ ఏ అభ్యంతరం ఉండదు. అని ఆ లేఖలో పేర్కొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: