తక్షణం వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలి

నికర జలాలు కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి

కందుల నారాయణ రెడ్డి డిమాండ్


( జానో జాగో వెబ్ న్యూస్- ఖమ్మం ప్రతినిధి)   

తక్షణం వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ప్రాజెక్టుకు నికర జలాలు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం పై రాష్ట్రంలోని  వైసిపి ప్రభుత్వం ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. ఈరోజుమార్కాపురం పట్టణం లోని ప్రెస్ క్లబ్ లో మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ నిన్నటికి నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వెలుగొండ ప్రాజెక్టును  తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారని తెలిపారు. ఈ ప్రాంత రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యలను ఖండించలేరా,,  వెలుగొండ ప్రాజెక్టును రద్దు చేయండి అని అంటూ ఉంటే అధికారంలో ఉండి నోరు మెదపరు ఏంటి,,, ఆంధ్ర రాష్ట్ర పరువును కెసిఆర్ కాళ్ళముందు పెట్టకండి,, వెలుగొండ ప్రాజెక్టును గజిట్ లో చేర్చమని ఏ ఒక్కరు ప్రశ్నించకపోవడం దురదృష్టకరమని తమ ఆవేదనను వ్యక్తపరిచారు. ఇకనైనా ఈ ప్రాంత శాసనసభ్యులు మంత్రులు తక్షణమే స్పందించి వెలుగొండ ప్రాజెక్ట్ ను తక్షణమే పూర్తి అయ్యేటట్లు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.


తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ కు 42 టీఎంసీల నికర జలాలను కేటాయించే టట్లు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. లేనిచో ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని తెలుగుదేశం పార్టీ ప్రజలతో మమేకమై ప్రజలను భాగస్వాములను చేస్తూ ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు కు నికర జలాలు కేటాయించేటట్లు చూస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం ఒంగోలు పార్లమెంటు పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, తెలుగుదేశం జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం,  కౌన్సిలర్లు ఏరువా వెంకట నారాయణ రెడ్డి, నాలి కొండయ్య, జిల్లా మాజీ వక్ఫ్  బోర్డ్ సభ్యులు డాక్టర్ మౌలాలి, మాజీ కౌన్సిలర్ కొప్పుల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ సయ్యద్ గఫార్, మార్కాపూర్ పట్టణ యూత్ అధ్యక్షులు గొల్మారి కాశి రెడ్డి పాల్గొన్నారు. 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: