నారా లోకేష్,..టీడీపీ నేతల అరెస్ట్ ధారుణం
కందుల నారాయణ రెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఇతర టీడీపీ నేతల అక్రమ అరెస్ట్ ధారుణమని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్ కార్యాలయంలో నారా లోకేష్ గారు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ కందుల నారాయణరెడ్డి మాట్లాడారు...దళిత యువతి రమ్య హత్య విషయంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన నారా లోకేష్ని, నక్కా ఆనంద బాబుని, దూళిపాళ్ల నరేంద్రని, శ్రవణ్ కుమార్ ని మొదలగు తదితర తెలుగుదేశం నాయకులను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేయడం దారుణమన్నారు.
ఒక ఆడబిడ్డ హత్యకు గురయితే అక్కడకు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి న్యాయం చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన నారా లోకేష్ తోపాటు తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ లు చేయడం అమానుషమని, ఈ ప్రభుత్వ విధానాలపట్ల రాష్ట్రంలోని ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని దుయ్యబటారు. తెలుగుదేశం నాయకులపట్ల పోలీసుల దురుసు ప్రవర్తన గర్హనీయం. అరెస్టు చేసినవారిని వెంటనే విడుదల చేయాలి. అలా కాని పక్షంలో మేముకూడా మా నిరశనలు తెలియజేస్తాం. పోలీసు స్టేషన్ కు వెళ్ళి స్వంచ్చందగా అరెస్టులు అవుతాం ఆని తెలిపారు. రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడంలో పెట్టిన శ్రద్ద పావలా వంతు “ మహిళల రక్షణ మీద పెట్టి ఉంటే ఇలా జరిగి ఉండేవా “అని అడుగుతున్నాం అని ప్రశ్నించారు.
అసలే కరోన నేపధ్యంలో దేశప్రజలంతా ఎగువ తరగతి నుంచి దిగువ తరగతి వరకు ఆర్ధికంగా కష్టాలలో వున్న ప్రజలపై ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు, బస్ చార్జీలు, ఇంటి పన్నులు, మద్యం రేట్లు, ఇసుక రేట్లు ముఖ్యంగా చివరికి చెత్తమీద కూడ పన్ను వేసి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్త పరిచారు. ఈ కార్యక్రమం లో ఒంగోలు పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, మార్కాపురం మండల పార్టీ అధ్యక్షులు జవ్వాజి రామానుజ రెడ్డి, మైనారిటీ నాయకులు పటాన్ ఇబ్రహీం, గులాబ్ బాష, సయ్యద్ గఫార్ , చక్కపెట్టెల షేక్. జిలాని, కొప్పుల శ్రీను,, గొట్టం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: