విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు..

 శ్రీకారం చుట్టిన సీఎం జగన్ 

*మంత్రి ఆదిమూలపు సురేష్ కృషి  ప్రశంసనీయం 

*సర్వాంగ సుందరంగా ముస్తాబైన పాఠశాలలు

డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి(జానో జాగో వెబ్ న్యూస్- విజయవాడ బ్యూరో)

పేదవాళ్ల తలరాతలు మారాలంటే వారి ఇంట చదువుల దీపం వెలిగించాలి అనే మౌలిక సూత్రాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పక ఆచరిస్తున్నారని వైకాపా రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి కొనియాడారు. చాలా కొద్ది మంది వ్యక్తులే ఇలాంటి గొప్ప ఆలోచనలు చేస్తారని అన్నారు. విద్యకోసం వెచ్చించే సొమ్మును మూలధన వ్యయంగా పరిగణించడం ప్రశంసనీయమన్నారు ఏలూరి. విద్యార్థులకు ఏ సందర్భంలో ఎంత తెలివిగా వారిపై సొమ్మును ఖర్చుచేస్తే సమాజానికి అంత గొప్ప ఫలితాలను అది అందిస్తుందన్నారు ఏలూరి రామచంద్రారెడ్డి. పేదవాళ్ళు చదుకోవాలని ఇంతలా తపన పడుతున్న ముఖ్యమంత్రులలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనేమో అని అన్నారాయన.. నాడు-నేడు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల పాఠశాలలు ఆధునీకరించడం గొప్ప నిర్ణయమని పేర్కొన్న ఏలూరి.. 

ఈ పథకం ద్వారా మరో రెండేళ్లలో మరో ముప్పై వేల పాఠశాలల రూపు రేఖలు మార్చడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని తెలిపారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో విద్యార్థులకు నాణ్యతలేని భోజనం పెట్టేవారన్న ఏలూరి.. ఇప్పుడీ పరిస్థితి పూర్తిగా మారిందని.. పిల్లలకు మంచి ఆరోగ్యకరమైన భోజనం అందుతుందన్నారు. విద్యార్థులకు విద్యాకానుక, వసతి దీవెనలతో వారి తల్లిదండ్రులకు భారం తగ్గించడం గొప్ప మేలు చేసే నిర్ణయమని కొనియాడారు. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది అంటే అందులో మంత్రి ఆదిమూలపు సురేష్ గారి కృషి కూడా ప్రశంసనీయమని.. విద్యార్థుల కోసం ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ మంత్రి పాత్ర గొప్పగా ఉండటం కలిసివచ్చిందని అన్నారు. ఇక నాడు-నేడు ద్వారా సర్వాంగ సుందరంగా ముస్తాబైన పాఠశాలలను ఈనెల 16న జాతికి అంకితం ఇవ్వడంపై తాను ఎంతో సంతోషిస్తున్నాని ఏలూరి చెప్పారు. ఈ సందర్బంగా విద్యార్థుల భవిష్యత్‌ దేదీప్యమానంగా వెలగాలని ఆయన ఆకాంక్షించారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: