జ్వాలా నరసింహారావుపై చర్యలు ఎందుకు తీసుకోరు

టీఆర్ఎస్ సర్కార్ కు కాంగ్రెస్ నేత నిరంజన్ ప్రశ్న

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

నార్కట్ పల్లి తహసీల్దార్ రాధ పై బదిలీ వేటు వేసిన రాష్ట్ర ప్రభుత్వం, నియమావళికి విరుద్దంగా రాజకీయ అంశాలపై స్పందించి టి.ఆర్.ఎస్ లోకి పార్టీ పిరాయింపులను సమర్థించిన సి.ఎమ్ ముఖ్య ప్రజాసంబందాల అధికారి జ్వాలా నరసింహారావు పై వేటు వేయదా..? అని తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బహుజన సమాజ పార్టీ నాయకుడు, మాజీ ఐ.పి.ఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ నెల 4న నార్కట్ పల్లి లో బసచేసిన హోటల్ వద్ద కనిపించిన కారణాన నార్కట్ పల్లి తహసీల్దార్ రాధను ఆఘమేఘాల మీద బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ నెల 5 వ తేదీన ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన తన వ్యాసంలో ప్రభుత్యోగిగా తన కున్న కట్టుబాటులను ఉల్లంఘించి రాజకీయ విషయాలలో ప్రత్యక్ష జోక్యము చేసుకుని ప్రతి పక్షాల స్థితిని విమర్శిస్తూ, టి.ఆర్.ఎస్ లోకి పార్టీ పిరాయింపులు సమంజసమేనని చట్ట వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి ముఖ్య ప్రజాసంబందాల అధికారి ( సి.పి.ఆర్.ఓ) జ్వాలా నరసింహారావు పై ఒక పక్షం రోజులైనా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుంటూ విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వోధ్యోగులు రాజకీయాలలో వేళ్లు పెట్టొదనే నియమావళిని నిష్పక్షపాతముగా, ఖచ్చితంగా పాటించాలనే చిత్తశుద్ధి టి.ఆర్.ఎస్ ప్రభుత్వానికి ఉంటే వెంటనే జ్వాలా నరసింహారావు ను ఆ పదవి నుండి తొలగించాలి. తమ పర అనే పక్ష పాత వైఖరితో వ్యవహరిస్తే ప్రజల ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని గ్రహిస్తే మంచిది. అని ఆయన పేర్కొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: