డెక్కన్ (హైద్రాబాద్ హిందీ) ఫిల్మ్

"హౌలా" హంగామా మొదలైంది!!

# డెక్కన్ సినిమాలను 

ప్రభుత్వాలు ప్రోత్సహించాలి...

విరివిగా రాయితీలివ్వాలి!!

-ముఖ్య అతిధి సయ్యద్ హుస్సేన్ (జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

ఇప్పుడిప్పుడే మెల్లగా విస్తరిస్తున్న డెక్కన్ సినిమాలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న ఈ పరిశ్రమకు విరివిగా రాయితీలివ్వాలని విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం హిందీలో రెండు చిత్రాలు రూపొందిస్తున్న ప్రముఖ డెక్కన్ వుడ్ దర్శకుడు సయ్యద్ హుస్సేన్. హైద్రాబాద్ హిందీ ఫిల్మ్ "హౌలా" చిత్ర ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 

     ఎస్.కె.ఎంట్రప్రైజస్ పతాకంపై సిరాజ్ అహ్మద్ సమర్పణలో షమీమ్ అహ్మద్-మహ్మద్ ఖాదర్ జిలాని నిర్మిస్తున్న ఈ హిలేరియస్ న్యూ ఏజ్ ఎంటర్టైనర్ కు బాలీవుడ్ దర్శకుడు కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. డెక్కన్ సూపర్ స్టార్ అద్నాన్ సాజిద్ ఖాన్ (గుల్లు దాదా), ప్రీతి నిగమ్, సనా ఖాన్, అజీజ్ రిజ్వాన్, నిషా సింగ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హైద్రాబాద్, సెన్సేషన్ థియేటర్ లో ఎంతో హంగామాగా మొదలైన ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకలో సయ్యద్ హుస్సేన్ తోపాటు... ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ హీనా షేక్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. సినిమాలోని పాత్రలన్నీ సీరియస్ గా నటిస్తుంటే... సదరు సీరియస్ నెస్ ఆడియన్స్ కు కడుపుబ్బ నవ్వించే కామెడీ పండించడం "హౌలా" ప్రత్యేకత అని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు!!

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: