భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి,,,,

ఏపీ ట్రాన్స్‌కో నోటిఫికేషన్


(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

ఉద్యోగం కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విజయవాడలోని ఏపీ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్దతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఏపీ ట్రాన్స్కో వారు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులను పోస్టల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది. దరఖాస్తుల ను పంపించాల్సిన చివరి తేదీ అగస్తు 10.. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజుని చెల్లించాల్సిన అవసరం లేదు. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ https://aptransco.co.in/ ను సందర్శించాలి.

 

ఉద్యోగ వివరాలు:

ఉద్యోగం: మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ

మొత్తం ఖాళీలు : 16

విద్యార్హత: సీఏ / సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ) ఇంటర్‌ ఉత్తీర్ణత. సంబంధిత ట్యాక్సేషన్‌ అండ్‌ అకౌంటింగ్‌ విషయాల్లో మూడేళ్ల అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయస్సు : 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం : నెలకు రూ. 28,000 – 60,000 /-

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

దరఖాస్తు పంపించాల్సిన చిరునామా

Chief General Manager (HR),

APTransco,

Vidyut Soudha,

Vijayawada – 520004.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: