పోలీస్ శాఖ ఆధ్వర్యంలో,,,
ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం స్థానిక బస్టాండ్ ఆవరణలో ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తర్లుపాడు మండల పరిసర ప్రాంతాలలో ఉన్న ఆటో, ట్రాక్టర్, గూడ్స్ ఆటో డ్రైవర్స్ కు డ్రైవర్ పక్క సీట్లో కూర్చోడాన్ని, వెహికల్ వెనుక డోర్ ఓపెన్ చేసి ప్యాసింజర్ ను కూర్చోబెట్టడం, ఓవర్ లోడ్, లైసెన్సు లేకుండా బండి నడపడం వంటి విషయాల గురించి ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించినారు. మరి కొంతమందికి చలానా విధించామని తాడి వారి పల్లి ఎస్ఐ ( తర్లుపాడు ) సువర్ణ తెలిపారు.
తర్లుపాడు మండలం లోని రోలగుం పాడు వద్ద ఎదురుగా వస్తున్న బైకులు గుద్దుకొని తీవ్రంగా గాయపడిన వ్యక్తులు బోరిగొర్ల..చిన్న కాశయ్య s/o గురవయ్య 65సం కంబం నుండి మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలిస్తుండగా చనిపోయారు. మరొక వ్యక్తి దొనకొండ మండలం ఆరేళ్ల పాడు గ్రామానికి చెందిన బాపనపల్లి తిరుపతయ్యs/o తిరుపతయ్య బైక్ నెంబర్ap39jw0423 మరొకటి ap25j4705 అను నెంబరు గల బైకులు ఎదురెదురుగా గుద్దుకొని తీవ్రంగా గాయాలు అయినట్లు తాడి వారి పల్లి ఎస్ఐ సువర్ణ తెలియజేశారు. మరియు సిబ్బంది పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: