ఎమ్మెల్సీ ఎన్నికలకు కరోనా లింకా

కె.సి.ఆర్. డొల్లతనానికి ఇదే నిదర్శనం

కాంగ్రెస్ నేత జి.నిరంజన్

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

ఎమ్మెల్సీ ఎన్నికలకు కరోనా లింకు పెట్టడమా... కె.సి.ఆర్ డొల్లతనానికి ఇదే నిదర్శనమని తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హుజూరాబాద్ ఉప ఎన్నికలు వస్తున్నాయని దళితబంధు పథకము పేరుమీద గత నెల 26 వ తేదీన ప్రగతి భవన్ లో 412 మంది ప్రతినిధులతో సమావేశమేర్పర్చి విందు ఆరంగించిన సి.ఎమ్ కె.సి.ఆర్, 119 మంది శాసన సభ్యులతో 6 శాసనమండలి స్తానాలకు జరిగే ఎన్నికలను కరోనా తగ్గే వరకు జరుపవద్దని ఎన్నికల కమిషన్ ను కోరడము ఆశ్చర్యకరంగా ఉన్నది. తమ మంత్రులను, శాసన సభ్యులను హుజూరాబాద్ లో మండల వారీగా ఇంచార్జిలుగా నియమించి కరోనా నిబంధనల పట్టింపు లేకుండా సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్న ముఖ్యమంత్రికి కేవలము 119 మంది శాసన సభ్యులు ఓట్లు వేసే శాసన మండలి లోని 6 స్థానాలకు జరిగే ఎన్నికలకు కరోనా సాకు తో అభ్యంతరం తెలుపడం హాస్యాస్పదం. రాష్ట్రంలో వేడెక్కుతున్న రాజకీయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సి.ఎమ్, ఎమ్.ఎల్.సి ఎన్నికలు జరిగితే తమ పార్టీలో పెల్లుబికే అసంతృప్తిని తట్టుకోలేకే ఎన్నికల వాయిదా కోరుతున్నారు. కె.సి ఆర్ హుజూరాబాద్ ఎన్నికల వరకు శాసనమండలి ఎన్నికల వాయిదా కోరుకుంటున్నారు. అని ఆయన విమర్శించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: