వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న వస్తున్న,,,,

విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ నటించిన...

పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ "లాభం"

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

విజయ్ సేతుపతి శ్రుతిహాసన్ జంటగా... తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన "లాభం" చిత్రం ఏక కాలంలో మొదటిసారి రెండు భాషల్లోనూ విడుదల అవుతోంది. ఇందులో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు.  S P జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 

శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్) ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.  ఈ చిత్రానికి లాయర్ శ్రీరామ్ సమర్పణ. హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.  విజయ్ సేతుపతి నటించిన మాస్టర్, ఉప్పెన తరువాత తెలుగులో విడుదల అవుతున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని... వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న విడుదల అవుతోంది.


ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... 'విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా నటించిన "లాభం" చిత్రం  సెప్టెంబర్ 9న తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదల అవుతోంది. ఇలా రెండు భాషల్లో మొదటిసారి విజయ్ సేతుపతి చిత్రం విడుదలకావడం విశేషం. మాస్టర్, ఉప్పెన తరువాత విజయ్ సేతుపతి నటించిన పక్కా కమర్షియల్ చిత్రం ఇది. తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది. విజయ్ సేతుపతి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది ' అన్నారు.

తారాగణం:-

విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్, జగపతిబాబు, సాయి ధన్సిక, కలైయ రసన్, రమేష్ తిలక్, పృత్వి రాజన్, డేనియల్ అన్నే పోపే, నితీష్ వీర, జయ్ వర్మన్ తదితరులు నటిస్తున్నారు.

 

సాంకేతిక నిపుణులు:-

రచన, దర్శకత్వం: S.P. జననాథన్

స్క్రీన్ ప్లే: N. కల్యాణ కృష్ణన్

మ్యూజిక్: D. ఇమామ్

DOP: రాంజీ

ఎడిటర్: N. గణేష్ కుమార్

ఆర్ట్ డైరెక్టర్: వి. సెల్వకుమార్

స్టంట్: ధన అశోక్

PRO: శ్రీ మారి


 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: