ప్రముఖ హీరోయిన్ పూర్ణ 

ముఖ్య అతిధిగా ఆగస్టు 27న

ఆర్.ఎమ్.ఎస్.గ్రూప్స్ 

ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభోత్సవం!!!


(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

      సినిమా పరిశ్రమకు, సినిమా ప్రియులకు మదనపల్లి సుపరిచితమే. ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్య దర్శనీయ ప్రాంతాల్లో మదనపల్లి ఒకటనే విషయం తెలిసిందే. మదనపల్లిలో హార్సిలీ హిల్స్ లో వివిధ భాషలకు చెందిన సినిమాలు నిత్యం షూటింగ్ జరుపుకుంటూ ఉంటాయి. 


 

     ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మదనపల్లిలో... శరవేగంగా అభివృద్ధి చెందుతున్న "ఆర్.ఎమ్.ఎస్.గ్రూప్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ"... మరింతగా విస్తరించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. అందులో భాగంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఆగస్టు 27, శుక్రవారం ఉదయం ప్రముఖ హీరోయిన్ పూర్ణ  ప్రారంభిస్తున్నది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకోనున్నారు.

     వేలాదిమందికి ఉపాధి కల్పించే ఐ.టి.కంపెనీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొనే అవకాశం లభించడం తనకు చాలా సంతోషాన్నిస్తోందని పూర్ణ పేర్కొన్నారు. ఆగస్టు 27, శుక్రవారం మదనపల్లి సందర్శన కోసం సన్నాహాలు చేసుకుంటున్నానని పూర్ణ తెలిపారు!!

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: