మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి,,

రూ 25 లక్షలు ఇవ్వాలి

టిడిపి, జనసేన డిమాండ్


ప్రకాశం జిల్లా టి.డి.పి. అధికార ప్రతినిధి శాసనాల వీర బ్రహ్మం

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా, మార్కాపురం మండలం రాజుపాలెం గ్రామంలో ఆదివారం ప్రభుత్వ స్కూల్ అంచు కూలి మృతి చెందిన విద్యార్థి పత్తి విష్ణు కుమార్ (వయస్సు 10 ) తల్లిదండ్రులకు ఎక్స్ గ్రేషియా క్రింద రూ 25 లక్షలను చెల్లించాలని నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ ఇమ్మడి కాశీ నాథ్, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి సత్యనారాయణ లు సోమవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుడు విద్యార్థి విష్ణు పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న  బాలుడు తల్లిదండ్రులను టీడీపీ, జనసేన నాయకులు పరామర్శించి ఓదార్చారు. అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం మాట్లాడుతూ


 

మృతుడు విద్యార్థి విష్ణు కుటుంబానికి తక్షణమే రూ 25 లక్షల నష్ట పరిహారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఒకవైపు పేదరికంతోను మరోవైపు కుమారున్ని పోగొట్టుకొని దుఃఖ సాగరంలో వున్న అ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన భాద్యత పాలక పక్షం మీద ఉందని గుర్తు చేశారు. అలాగే శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ భవనాలను,ముఖ్యంగా అటువంటి పాఠశాలను కూల్చివేసి నూతన భవన నిర్మాణాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. పేరుకు నాడు -నేడు తప్ప ఆచరణలో ఎక్కడ అమలు జరగడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు జవ్వాజి రామాంజనేయులురెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్, జిల్లా కార్యదర్శి తిరుమల శెట్టి వీరయ్య, సురేష్, టిడిపి నాయకులు తాండ్ర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: