ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డును అందుకున్న,,,

సౌదీ అరేబియా లో  ఉంటున్న  సిద్ధీక్‌ అహ్మద్‌

శానిటైజేషన్‌ విప్లవం కోసం 2021సంవత్సరానికిగానూ ప్రధానం 


(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

రియాద్‌లో ని  భారత రాయబార కార్యాలయంలో జరిగిన ప్రత్యేక వేడుకలో  ఇరామ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌  డైరెక్టర్‌ డాక్టర్‌ సిద్ధీక్‌ అహ్మద్‌ కు  అధికారికంగా  2021 ప్రవాసీ భారతీయ  సమ్మాన్‌ అవార్డును (పీబీఎస్‌ఏ)ను సౌదీ అరేబియాలో భారత రాయబారి హిజ్‌ ఎక్స్‌లెన్సీ డాక్టర్‌ ఔసఫ్‌ సయీద్‌ అందజేశారు. ఈ సంవత్సరం మిడిల్‌ఈస్ట్‌ నుంచి  ఈ అవార్డు అందుకున్న నలుగురులో డాక్టర్‌ అహ్మద్‌ ఒకరు కాగా సౌదీకి ప్రాతినిధ్యం వహించిన ఒకే ఒక్క వ్యక్తి ఆయన. 

భారతదేశంలో ఇరామ్‌ గ్రూప్‌ విస్తృత స్థాయిలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది . దేశంలోని ఐదు రాష్ట్రాలలో 2వేల మందికి పైగా ఉద్యోగులను  సంస్థ కలిగి ఉంది.  ప్రధానంగా శానిటైజేషన్‌ రంగంలో  స్థానిక అవసరాలకు తగినట్లుగా దేశీయ సాంకేతికతలను కంపెనీ అభివృద్ధి చేస్తుండటంతో పాటుగా ఆర్‌ అండ్‌ డీ ఆధారిత సామాజిక సంస్ధ ఇరామ్‌ సైంటిఫిక్‌ సొల్యూషన్స్‌ ద్వారా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. 2011 లో ఈ సంస్థను డాక్టర్‌ అహ్మద్‌ సొంతం చేసుకున్నారు.


స్వచ్ఛ భారత్‌ అభియాన్‌కు అనుగుణంగా ఆటోమేటెడ్‌ పబ్లిక్‌  శానిటేషన్‌ పరిష్కారంగా  వినూత్నమైన ఈ–టాయ్‌లెట్‌ను ఆవిష్కరించింది. దీనిని యుఎన్‌ ఇన్నోవేషన్‌ ఎగ్జిబిషన్‌ వద్ద ప్రదర్శించారు. ప్రస్తుత శానిటైజేషన్‌ తీరును సమూలంగా మార్చగల సామర్థ్యం దీనికి ఉన్నట్లుగా యుఎన్‌ ప్రతినిధులు దీనిని  గుర్తించారు. ఈ పేటెంటెడ్‌ టాయ్‌లెట్‌కు ఇప్పటి వరకూ 12 మిలియన్‌ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇరామ్‌ సైంటిఫిక్‌ సొల్యూషన్స్‌ ఇప్పటికే 44 జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. డాక్టర్‌ అహ్మద్‌ గతంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా  టాయ్‌లెట్‌ టైటాన్‌ అవార్డును 2015లో అందుకున్నారు. మానవజాతి ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక  క్లిష్ట సవాళ్లకు తగిన పరిష్కారాలను అందించేందుకు కట్టుబడిన డాక్టర్‌ అహ్మద్‌ను ప్రశంసించిన డాక్టర్‌ సయీద్‌ మాట్లాడుతూ  కంపెనీ యొక్క వినూత్నమైన ఉత్పత్తులు, సేవలు ఎన్నో స్మార్ట్‌ సిటీస్‌ను సురక్షితంగా, స్వచ్ఛంగా, స్మార్టర్‌గా మారుస్తున్నాయని, ఈ అవార్డు అందుకోవడానికి అన్ని అర్హతలూ ఆయనకున్నాయన్నారు. 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: