ఆగస్టు 2021

 భూ అక్రమాలకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం

12 వీఆర్ఓలు...ఒ కంప్యూటర్ ఆపరేటర్ విదుల నుంచి తొలగింపు

ఉత్వర్వులు జారీ చేసిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్

ప్రకాశం జిల్లా కలెక్టర్. ప్రవీణ్ కుమార్
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ, మండలాల వారిగా భూ అక్రమాలకు పాల్పడి, వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ఇతరులకు కట్టబెట్టిన ఆరోపణల నేపధ్యంలో కొంతమంది అధికారులతో పాటు 12 మంది వి.ఆర్.ఓ.లను,  ఓ కంప్యూటర్ ఆపరేటర్ ను  విధుల నుంచి తొలగిస్తూ ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు  జారీచేశారు. 

సస్పెండ్ అయిన వారిలో...

మార్కాపురం-2-  వి.ఆర్.ఓ.ఎస్.శ్రీనివాస రెడ్డి    

  “. “.       -3-  కె. రాజశేఖర్ రెడ్డి

  “  “.       -4- ఎమ్. కోటయ్య

గజ్జలకొండ-1-జి. శ్రీనివాస రెడ్డి

 గజ్జలకొండ-2-వై. గోవింద రెడ్డి

 పెద్ద యాచవరం ఎస్.కె. కాశీమ్ వలీ 

నాయుడుపల్లి — వై. కాశివిశ్వేశర రెడ్డి

రాయవరం - జి. సుబ్బారెడ్డి 

ఇడుపూరు - వి.వి. కాశిరెడ్డి

కోలభీమునిపాడు - ఐ. చలమారెడ్డ్

చింతకుంట, బడేఖాన్ పేట - డి. మస్తాన్ వలి కొండెపల్లి,

క్రిష్ణాపురం-ఎమ్.రామచంద్రారావు

భూపతిపల్లి- పి. మల్లికార్జున

చింతకుంట విలేజ్ సర్వేయర్ ఎమ్.విష్ణుప్రసన్న కుమార్, 

                   ,.                    పి. నాగరాజు   డేటా ఆపరేటర్. 

సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 ఉన్మాదిలా వ్యవహరిస్తున్నాడు

బండి సంజయ్ ను కట్టడి చేయండి

డీజీపీకి కాంగ్రెస్ నేత  జి.నిరంజన్ లేఖ  

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

బండి సంజయ్ ఉన్మాదిలా విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని. ఆయన్ని కట్టడి చేయండి అంటూ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ కోరారు. ఈ మేరకు డీజీపీకి ఆయన ఓ లేఖ రాశారు. ఆ లేఖలోని సారాంశం ఇలావుంది. ఈ నెల 27 న పాదయాత్ర ప్రారంభించిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్మాదిలా, మత విద్వేషాలు రెచ్చగొట్టి, రాష్ట్రములో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వాఖ్యలు చేస్తున్నారు. ఆయనను కట్టడి చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూడాల్సిన భాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖది. హిందువుల గురించి ఎంతకైనా తెగిస్తా. పక్కా హిందూయిజాన్ని రగిలిస్తా. నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని మాట్లాడటం హిందువుల అభివృద్దికా? ఇతరులను రెచ్చగొట్టడానికా గమనించాలి. బండి సంజయ్ పాదయాత్ర పై మాకు అభ్యంతరం లేదు. ఉద్రిక్తత, రెచ్చగొట్టే మాటలు అనుమతించాలా లేదా డి.జి.పి ఆలోచించాలి. రాష్ట్రంలో మత సామరస్యము, శాంతి భద్రతలు కాపాడే భాద్యత డి.జి.పి పై ఉన్నది. ఈ రోజు పత్రికల్లో వచ్చిన వార్తలను డి.జి.పి కి పంపిస్తాము. నిజాం స్వయంగా పరమత సహనము కల్గిన వ్యక్తి. ఆయన పరంగా మత వివక్షతలు లేవు. కానీ రజాకార్ల విచ్చలవిడి తనాన్ని ఆయన అరికట్టలేకపోయారు. నిజాం మనవడు ప్రిన్ష్ ముఫ్ఫక్కమ్ జా 1999 లో ఒక పత్రిక లో వచ్చిన వార్తను చదివి నిజాం ట్రస్ట్ ఏనుగు హాష్మీ ని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి మందిర బోనాల ఊరేగింపుకు అనుమతించిన తీరు ఆ కుటుంబపు పరమత సహనానికి నిదర్శనం. ఆయన హయాంలో రాజాబహద్దూర్ వెంకట్రామరెడ్డి కొత్వాల్ గా రాజా కిషన్ ప్రసాద్, రాజా రావులు ఆయన కొలువులో ఉన్నత పదవులలో ఉన్న విషయం మరువద్దు. నిజాం రాచరికాన్ని , రజాకార్ల ఆగడాలను వ్యతిరేకిస్తూ 1938 లో ఏర్పడిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై నిజాం ప్రభుత్వం నిషేధం విధించిన విషయం బండి సంజయ్ కు తెలియక పోవచ్చు.  చైనా తో యుద్ధ సమయంలో అప్పటి ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి పిలుపు మేరకు నిజాం 5000 కె.జి ల బంగారం ఇచ్చిన విషయం బండి సంజయ్ కు బహుశా తెలియక పోవచ్చు. టి.అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయములో అల్లర్లు చెలరేగితే, మొన్న బండి సంజయ్ చార్మినార్ వద్ద మాట్లాడిన చోటనే ముఖ్యమంత్రి అంజయ్య బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి మజ్లిస్ నాయకులను గట్టిగా హెచ్చరించడమే కాకుండా మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు సుల్తాన్ సలాహుద్దీన్ తో సహా మజ్లీస్ శాసన సభ్యులను నగర బహిష్కరణ చేశారు. 2012 లో కూడా భాగ్యలక్ష్మి మందిర విషయములో గొడవ చేస్తున్న మజ్లిస్ శాసన సభ్యులను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇప్పటికయినా బండి సంజయ్ తన ధోరణి మార్చుకుని తన పార్టీ ప్రచారం చేసుకుంటే ఎవరికీ ఏ అభ్యంతరం ఉండదు. అని ఆ లేఖలో పేర్కొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

 టీడీపీ నేతలు ఢిల్లీ యాత్ర చేసినా...

మోకాళ్ళ యాత్ర చేసినా,,

వెలిగొండ నిర్మాణం ఆగదు

వైసీపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతల పరిస్థితి నానాటికి దిగజారిపోతుందని వైకాపా రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి విమర్శించారు. పూర్తవుతున్న వెలిగొండపై క్రెడిట్ కోసం పాకులాడటం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని అన్నారు. వెలిగొండ మీద చెయ్యాల్సిన దుష్ప్రచారం అంతా చేసి ఆ పార్టీ నేతలు ఇప్పుడు కేంద్ర మంత్రిని కలవడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. టీడీపీ నేతలు వెలిగొండను ఆపడానికి ఢిల్లీ యాత్ర చేసిన  మోకాళ్ళ యాత్ర చేసినా ప్రాజెక్టును పూర్తి చేసి తీరతాం అన్నారు. అంతేకాదు ఇక్కడ కూడా చంద్రబాబు రెండు కళ్ళ  సిద్ధాంతాన్ని అవలంభించారని మండిపడ్డారు.. చంద్రబాబుకు వెలిగొండ మీద చిత్తశుద్ధి ఉంటే ఆయన కూడా కేంద్ర మంత్రిని ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. గతంలో వెలిగొండ ప్రాజెక్టుకు ఎన్నో అడ్డంకులు సృష్టించిన చంద్రబాబు నేడు దుష్ప్రచారానికి తెరలేపడం సిగ్గుచేటు అని విమర్శించారు. krmb పరిధిలోకి వెలిగొండ ప్రాజెక్టును చేర్చకపోవడంపై టీడీపీ దుష్ట రాజకేయం చేస్తుందని.. వారి వైఖరి వల్లే తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదులు చేస్తుందని ఆరోపించారు.
ప్రకాశం బ్యారేజి వద్దకు వెళ్లి ఆ ప్రాంత వాసులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించడం.. వెలిగొండ వద్దకు వెళ్లి ప్రకాశం జిల్లా ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు.. ఆయనగారి వైఖరి వలన అప్పట్లో అన్ని ప్రాంతాల ప్రజలకు నష్టం జరిగిందని ఆరోపించారు. వెలిగొండ విషయంలో కూడా కృష్ణా జిల్లా నేతలతో ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ.. ఇటు పశ్చిమ ప్రకాశం జిల్లా నేతలతో అనుకూలంగా ఉన్నామని మాట్లాడించడం చంద్రబాబు దివాలాకోరు తనానికి నిదర్శనం అని దుయ్యబట్టారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వెలిగొండ ప్రాజెక్టు విషయంలో టీడీపీ నేతలను ఏకాభిప్రాయానికి తీసుకురావాలని ఏలూరి రామచంద్రారెడ్డి సూచించారు.

 నాగ శౌర్య , రీతువర్మ

’ ‘వరుడు కావలెను‘ టీజర్ విడుదల


(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ దర్శకత్వంలో సిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ రూపొందిస్తున్న చిత్రం  ‘వరుడు కావలెను‘.

నేటి (31-8-2021) ఉదయం 10.08 నిమిషాలకు  ‘వరుడు కావలెను‘ చిత్రం టీజర్ ను విడుదల చేసి హారిక అండ్ హాసిని క్రియేషన్స్  అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సితార ఎంటర్ టైన్మెంట్స్.

చిత్ర కథ,సంభాషణల బలం స్పష్టంగా కనిపిస్తుంది టీజర్ లో. నాయకా,నాయికల పాత్రల మనస్తత్వాలు, అభిరుచులు,ఆలోచనలు, కథానుగుణంగా సాగే వినోదం, సంగీతం, నటీ నటుల (నాగశౌర్య, రీతువర్మ, నదియ, హిమాజ, వెన్నెల కిషోర్, ప్రవీణ్) ఉత్తమాభినయం టీజర్ లో ప్రతి క్షణం క(అ)నిపిస్తాయి. ఖచ్చితంగా ‘వరుడు కావలెను‘ చిత్రాన్ని ప్రేమ కథా చిత్రాలలో ప్రత్యేకంగా చూసేలా చేస్తాయి. ఓ ఫీల్ గుడ్ మూవీని చూడ బోతున్నామన్న ఆసక్తిని కలిగిస్తుంది ఈ టీజర్. చివరలో హ్యాపీ బర్త్ డే బాబాయ్ అంటూ హారిక అండ్ హాసిని క్రియేషన్స్  అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు నిర్మాత సూర్యదేవర నాగవంశి తెలపటం కనిపిస్తుంది. ఇందులో అక్టోబర్ నెలలో చిత్రం ధియేటర్ లలో విడుదల అన్నది స్పష్టం చేశారు. 

ఇప్పటికే చిత్రం నుంచి విడుదల అయిన '‘‘కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా', అలాగే 'దిగు దిగు నాగ'  పాటలు బహుళ ప్రజాదరణ పొందినాయి. దీనికి ముందు ఇప్పటివరకు విడుదల చేసిన చిత్రాలు, ప్రచార చిత్రాలు వంటి వాటికి కూడా ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు లభించాయి. సామాజిక మాధ్యమాలలో కూడా వీటికి ప్రాచుర్యం లభించింది. ప్రస్తుతం చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.  ‘వరుడు కావలెను‘ చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు,నటీ నటుల అభినయాలు చిత్ర కథానుగుణంగా సాగి  అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి అన్న నమ్మకాన్ని వ్యక్తం  చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. 

'వరుడు కావలెను' చిత్రంలో నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా  నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, పమ్మి సాయి, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.

ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్; ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్   

సమర్పణ: పి.డి.వి.ప్రసాద్

నిర్మాత: సూర్య దేవర నాగవంశి

కథ- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 ఓటరు నమోదుకు మళ్లీ అవకాశం

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ అర్హులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

కొత్తగా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించింది. జనవరి 1,2022 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని పేర్కొంది. వారితోపాటు గతంలో ఓటర్లుగా నమోదు చేసుకోని వారికీ అవకాశం కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ ఓ ప్రకటన విడుదల చేశారు.   

షెడ్యూల్‌ ఇలా.. 

► ఆగస్టు 9 నుంచి అక్టోబర్‌ 31 వరకు ఇంటింటి ఓటరు జాబితా పరిశీలన.

► నవంబర్‌1న ముసాయిదా ఓటరు జాబితా విడుదల.

► నవంబర్‌ 30 వరకు అభ్యంతరాల స్వీకరణకు అనుమతి.

► నవంబర్‌ 20, 21 తేదీల్లో ఓటరు నమోదుపై ప్రచార కార్యక్రమం.

► అదే తేదీల్లో పోలింగ్‌  కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బూత్‌ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు. 

► ఆ పోలింగ్‌ కేంద్రాల్లోనే  దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా మార్పులు, చేర్పులున్నా సరిచేసుకోవచ్చు.  

http://www.nvsp.in లేదా వోటర్‌ హెల్ప్‌లైన్‌ అనే మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

► డిసెంబర్‌ 20 నాటికి అభ్యంతరాల పరిశీలన పూర్తి.

► జనవరి 5న తుది ఓటర్ల జాబితా విడుదల.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 అపహరణకు గురైన 5 రోజుల పాప కేసు

డి.ఎస్.పి. కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో

పది గంటల లోపు చేధించి.. తల్లి ఒడికి చేర్చి

నిందితుల అరెస్ట్, పోలీసులను అభినందించిన ప్రజాసంఘాలు  


ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికాగర్గ్ (ఐ.పి.ఎస్.)

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

అపహరణకు గురైన 5 రోజుల పాప కేసును డి.ఎస్.పి. కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి పది గంటల లోపు చేధించి.. తల్లి ఒడికి చేర్చారు. నిందితుల అరెస్ట్ చేయగా, పోలీసులను ఈ సందర్భంగా ప్రజాసంఘాలు అభినందించాయి. ఈ కేసు ఛేధించడంలో సి ఐ. బి. టి. నాయక్ , పట్టణ ఎస్సై కె.నాగమల్లేశ్వరరావు , గ్రామీణ  ఎస్సై కోటయ్య, పోలీస్ సిబ్బంది పాలుపంచుకొన్నారు. వివరాలలోకి...ఫిర్యాదుదారు ఏరువ శ్రీరాములు గుంటూరు జిల్లా, కారంపూడి మండలం, బట్టువారిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అయినట్లు  అతనికి 3 సంవత్సరాల క్రితం మార్కాపూరం మండలం, మాల్యవంతునిపాడు గ్రామానికి చెందిన ఏరువ కోమలితో వివాహం జరిగింది. కోమలి ప్రసవం కోసం తేది 23.08.2021 న మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు, తేది 24.08.2021 ఉదయం 07.00 గంటలకు పిర్యాది భార్య ఆడ శిశువును ప్రసవించినట్లు, పాపకు  కామెర్ల వ్యాధి వచ్చినందున, తేది 27.08.2021 న రాత్రి వారు పాపను చికిత్స కోసం ఆసుపత్రిలోని  ఫోటోథెరపీ గదిలో ఉంచగా, తేది 28.08.2021 మధ్యాహ్నం ఒక గుర్తు తెలియని మహిళ బుర్ఖా ధరించి శిశువును కిడ్నాప్ చేసింది.
చుట్టుప్రక్కల విచారించిన పిదప, ఫిర్యాదుదారు మార్కాపూర్ రూరల్ పిఎస్‌లో కేసు పెట్టడo జరిగినది. వెంటనే మార్కాపూర్ రూరల్ SI గారు కేసు నమోదు చేసి, కేసు వివరాల గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించిన్నారు. ఈ విషయం పై వెంటనే స్పందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి. మలిక  గర్గ్ ఐపిఎస్  గారు ఒంగోలు లోని PCR ద్వారా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేసి, అపహరించిన పాప జాడను గుర్తించడానికి, జిల్లా పరిదిలోని ముఖ్యమైన జంక్షన్‌లలో, పాప ఆచూకి కొరకు వాహనాల తనిఖీ నిర్వహించమని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి,  జిల్లాలోని CI లు మరియు SI లు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, సరిహద్దు జిల్లా చెక్ పోస్ట్ మరియు ఇతర ముఖ్యమైన జంక్షన్లలో వాహన శోధన ప్రారంభించారు. SP గారు జిల్లాలోని అన్ని సీసీ కెమెరా ఫుటేజీలను సేకరించి, ఎప్పటికప్పుడు,  సీసీ కెమెరా ఫుటేజీల సమాచారాన్ని, అధికారులకు పంపుతూ, నిర్విరామంగా ముద్దాయి ఆధారాల కోసం తనిఖీలు నిర్వహిస్తుండగా, పోలీస్ వారికి రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు, తేది 28/29.08.2021 మధ్య, రాత్రి దాదాపు 03.00 గంటలకు మార్కాపూర్ రూరల్ SI మరియు అతని సిబ్బంది కంభం రోడ్డులోని, మధు చిల్డ్రన్ హాస్పిటల్‌ని సందర్శించి, నిందితులు  పాపను మార్కాపురం  ప్రభుత్వ  ఆసుపత్రి పోటో థెరపి రూములో నుండి కిడ్నాప్ చేసినట్లు అంగీకరించింది. మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో  పాపను కిడ్నాప్ చేసి, తన దూరపు బంధువు ద్వారా రూ. 50,000/- కు అమ్మకానికి  ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుపగా,  ముద్దాయిలను అరెస్టు చేయబడినది. మరియు వారి దగ్గర నుండి, రూ. 50,000/-, డబ్బులు  మరియు బాండ్ పేపర్స్ ను స్వాదీనం చేసుకోబడినవి.  కిడ్నాప్ కు గురి కాబడిన 5 రోజుల పాపను 10 గంటలలో రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రకాశం జిల్లా పోలీసు సూపరింటెండెంట్, శ్రీమతి. మలిఖా గార్గ్, IPS గారు, వేగంగా స్పందించి మరియు సంఘటన జరిగిన 10 గంటలలోపు ఈ కేసును చేదించిన పోలీసు సిబ్బందిని ప్రశంసించారు, వారికి రివార్డులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పీ యం. కిషోర్ కుమార్. మార్కాపురం సిఐ బీ.టీ. నాయక్, మార్కాపురం సర్కిల్  ఎస్సైలు జి. కోటయ్య, కె. నాగమల్లేశ్వరరావు, వై.నాగరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు.




✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


  

 

 మున్సిపల్ కార్మికులు సమస్యల పరిష్కారం కోరుతూ..

ఆగస్ట్ 31,సెప్టెంబర్1,2 తేదీల్లో నిరసనలు

సెప్టెంబర్6న చలో మున్సిపల్ కార్యాలయాలు


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

          మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ అలవెన్సులు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుతలూ ఆగస్ట్ 31,సెప్టెంబర్1,2 తేదీల్లో నిరసన సెప్టెంబర్6న చలో మున్సిపల్ కార్యాలయాలు కార్యక్రమాన్ని చేపటనున్నామని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లొయిస్ యూనియన్ (సి ఐ టి యు) తెలిపింది. ఇదిలావుంటే ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లొయిస్ యూనియన్ (సి ఐ టి యు) ఆధ్వర్యంలో  మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు డి కె ఎం రఫీ మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్య, ఇంజనీరింగ్ కార్మికులకు రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ఈ ఎస్ఐ, పీఎఫ్ ,హెల్త్ అలవెన్సు బకాయిలు చెల్లించాలని ఆయన అన్నారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్1,2 తేదీల్లో నిరసన దీక్షలు,సెప్టెంబర్6న చలో మున్సిపల్ కార్యక్రమాల ద్వారా  కార్యాలయాల వద్ద పోరాట కార్యక్రమాలు జరుగుతాయని, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని చెయ్యాకపోగా అప్కాస్ వంటి సంస్థ లో కార్మికులను చేర్చి బానిసలుగా తయారు చేస్తున్నదని,

సి.ఐ.టి.యు. జిల్లా అధ్యక్షుడు డి.ఎం.కె. రఫీ,

నాయకులు యేనుగుల సురేష్ కుమార్

 కార్మికులను సచివలయాలకు అప్పగించడం వలన పనిచేసే వారి కంటే పెత్తనం చేసే వారి సంఖ్య ఎక్కువుగా ఉందన్నారు. కార్మికులను రెగ్యులరైజ్ చేసి సచివాలయాలకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. పని ముట్లు, గ్లౌజులు,యూనిఫారాలు ఇవ్వడం లేదన్నారు. చిన్న చిన్న కారణాలు చూపి పని నుంచి ఆపేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ప్రాణాలు ఒడ్డి కరోనా సమయంలో సేవలు అందించిన కార్మికులకు తగిన గుర్తింపు సౌకర్యాలు కల్పించకపోవడం దారుణమన్నారు. కరోనా లో మరణించిన వారిని ఆదుకున్న పాపాన పోలేదన్నారు. కార్మికులకు భద్రత లేకుండా పోతుందని,ప్రజలు ప్రాణాలు కాపాడుతున్న కార్మికుల ప్రాణాల కాపాడే వారు కరువయ్యారన్నారు. ఈ పరిస్తితిల్లో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఆప్కాస్ నుంచి మినహాయించాలని,రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


  

 మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి,,

రూ 25 లక్షలు ఇవ్వాలి

టిడిపి, జనసేన డిమాండ్


ప్రకాశం జిల్లా టి.డి.పి. అధికార ప్రతినిధి శాసనాల వీర బ్రహ్మం

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా, మార్కాపురం మండలం రాజుపాలెం గ్రామంలో ఆదివారం ప్రభుత్వ స్కూల్ అంచు కూలి మృతి చెందిన విద్యార్థి పత్తి విష్ణు కుమార్ (వయస్సు 10 ) తల్లిదండ్రులకు ఎక్స్ గ్రేషియా క్రింద రూ 25 లక్షలను చెల్లించాలని నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ ఇమ్మడి కాశీ నాథ్, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి సత్యనారాయణ లు సోమవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుడు విద్యార్థి విష్ణు పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న  బాలుడు తల్లిదండ్రులను టీడీపీ, జనసేన నాయకులు పరామర్శించి ఓదార్చారు. అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం మాట్లాడుతూ


 

మృతుడు విద్యార్థి విష్ణు కుటుంబానికి తక్షణమే రూ 25 లక్షల నష్ట పరిహారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఒకవైపు పేదరికంతోను మరోవైపు కుమారున్ని పోగొట్టుకొని దుఃఖ సాగరంలో వున్న అ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన భాద్యత పాలక పక్షం మీద ఉందని గుర్తు చేశారు. అలాగే శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ భవనాలను,ముఖ్యంగా అటువంటి పాఠశాలను కూల్చివేసి నూతన భవన నిర్మాణాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. పేరుకు నాడు -నేడు తప్ప ఆచరణలో ఎక్కడ అమలు జరగడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు జవ్వాజి రామాంజనేయులురెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్, జిల్లా కార్యదర్శి తిరుమల శెట్టి వీరయ్య, సురేష్, టిడిపి నాయకులు తాండ్ర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


 

 నూతనంగా బాధ్యతలు చేపట్టిన,,,

మూడవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సర్వయ్య

అభినందనలు తెలిపిన జిల్లా ఎమ్.పి.జె బృందం


(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)

మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా అధ్యక్షులు ఎస్.కే. ఖాసిం నాయకత్వంలో  ఎం.పి.జె నాయకులు ఇటీవల నగరంలో 3వ పట్టణ పోలీసు స్టేషన్ కు  బదిలీపై వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సర్వయ్యని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎం.పి.జె నాయకులు సి.ఐ.ని శాలువా, బొకే లతో సన్మానించి, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమములో జిల్లా ఎం.పి.జె ఉపాధ్యక్షులు ఎమ్.ఏ. గఫార్,  కోశాధికారి ఎమ్.డి. హకీం, కార్యదర్శి ఎమ్.డి.రజబాలి, మీడియా ఇంచార్జ్ చక్రవర్తి, నాయకులు  అజీజ్, రఫీఖ్,.ఖాదర్, సర్వర్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.






 














 టాటా మ్యాజిక్ ఆటో బోల్తా.... 

నలుగురు మహిళలు, ఒక పురుషుడు మృతి


 (జానో జాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

 తర్లుపాడు మండలంలోని రోలుగుంపాడు ఎస్టి కాలనీ సమీపంలో ఒంగోల్ కర్నూలు వెళ్లే హైవే రహదారి పై గేదెను తప్పించబోయి ప్రమాదవశాత్తు ఐదు మంది మృతి చెందారు. వివరాల్లోకి వెళితే పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ యు. సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం టాటా మ్యాజిక్ ఆటో లో ప్రయాణించే వీరంతా దర్శి పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన వారని వీరు బేస్తవారిపేట మండలం కొత్తపేట గ్రామానికి పప్పు అన్నాలు తిని వచ్చిన వారి బంధువులతో కలిసి తిరుగు ప్రయాణంలో రోలుగుంపాడు ఎస్టి కాలనీ సమీపాన అప్పటికే గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి రోడ్డు పై పడి ఉన్న గేదెను తప్పించబోయి ప్రమాదవశాత్తు చీమకుర్తి నుండి బేస్తవారిపేట వైపు వస్తున్న టిప్పర్ లారీ ని ఢీకొట్టడంతో ముగ్గురు మహిళలు అయిన పోట్లపాటి. శారమ్మ, గొంగటి. మార్తమ్మ, ఇత్తడి. లింగమ్మ తోపాటు టాటా మ్యాజిక్ ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, గాయాలైన వారిని హుటాహుటిన 108 వాహనంలో మరియు ప్రైవేటు వాహన సహాయంతో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పరామర్శించామని తెలియజేశారు.
గాయాలతో వచ్చిన వారిని కంభం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా పోట్లపాటి. కోటమ్మ మృతి చెందారు. మొత్తం టాటా మ్యాజిక్ వాహనంలో 15 మంది ఈ ఆటోల ప్రయాణిస్తున్నారని వీరిలో నలుగురు మహిళలు, ఒక పురుషుడు చనిపోగా, మిగిలిన పదిమందికి తీవ్ర గాయాలు కావడంతో కంభం ప్రభుత్వ ఆసుపత్రి నుండి మార్కాపురం జిల్లా వైద్యశాల తరలించి అక్కడ నుండి మెరుగైన చికిత్స కొరకు ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ కు పంపించడం జరిగిందన్నారు.అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మార్కాపురం ప్రభుత్వాసుపత్రిలో నాలుగు మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తారని, కంభం ప్రభుత్వాసుపత్రిలో చనిపోయిన కోటమ్మకు ఆ ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహిస్తారని తెలిపారు. ఈ సంఘటన స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ రవీంద్ర రెడ్డి, తాడివారిపల్లి ఎస్ఐ మల్లవరపు. సువర్ణ, దొనకొండ ఎస్ఐ ఫణిభూషణ్, ఏ.ఎస్ఐ సంజయ్, హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణారెడ్డి, కానిస్టేబుల్ కాశీనాథ్, ఖాజావలి పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 ఎంపీజేను బలోపేతం చేద్దాం

ఎస్.కే.ఖాసీమ్


(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)

ఎంపీజేను బలోపేతం చేద్దామని తమ సంఘం నేతలకు ఆ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎస్.కే. ఖాసిమ్ పిలుపునిచ్చారు. యం. పి. జే  మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎస్.కే. ఖాసిమ్ ను  కొత్తగూడెం యం.పి.జె., యూనిట్ అధ్యక్షుడు  యూసబ్ ఖాన్ తదితరులు కలిశారు. ఈ సందర్భంగా జరిగిన  చర్చ లలో భద్రాద్రి కొత్త గూడెం జిల్లా లో, యంపిజె అభివృద్ధి గురించి, నాయకుల సమన్వయం గురించి, పలు అంశాలపై ఖాసిమ్ గారు వారికి దిశానిర్దేశం చేశారు.  ఈ కార్య క్రమము లో  జిల్లా ఎమ్.పి.జె నాయకులు ఖమర్  పాషా, దుర్గా రావు, సయ్యద్ అతావుల్లా, సల్మాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 ఏలూరి లక్ష్మీదేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో,,,

రేషన్ పంపిణీ

ట్రస్ట్ సేవలు హర్షణీయం.. ఎమ్మెల్యే కెపి నాగార్జున రెడ్డి


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆర్ధిక సహకారంతో వైసీపీ రాష్ట్ర నాయకులు, ఎస్ ఆర్సీ లాబొరేటరీస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువులను స్ఫూర్తి వెల్ఫెర్ స్కూల్ లో  ఎమ్మెల్యే కెపి నాగార్జున రెడ్డి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మాట్లాడుతూ లక్ష్మీదేవి పేరుతో ట్రస్ట్ ప్రారంభ దశలోనే సేవా దృక్పథంతో అనాధ పిల్లలకు రూ 10 వేల విలువ చేసే నిత్యావసర వస్తువులు అందజేయడం హర్షణీయమని అన్నారు.


భవిష్యత్తు లో  ట్రస్ట్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు. లక్ష్మీదేవి తనయుడు రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి మాట్లాడుతూ  తమ ట్రస్ట్ ద్వారా పశ్చిమ ప్రకాశంలో పేదలకు ముఖ్యంగా విద్య, వైద్యానికి సంబంధించి ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు తెలిపారు. కరోనా కష్ట కాలంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో  సుమారు రూ 2 కోట్ల విలువజేసే హ్యాండ్ శానిటైజర్ ను, మాస్కు లను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.   ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిసి జనసభ ప్రధాన కార్యదర్శి పిఎల్పీ యాదవ్,విశ్రాంత ప్రిన్సిపల్ డి రామిరెడ్డి, వైసీపీ నాయకులు గుంటక చెన్నారెడ్డి, స్కూల్ ప్రిన్సిపాల్ భాను తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 మీర్జాపేటలో కోవిడ్ వ్యాక్సిన్...

స్పెషల్ డ్రైవ్


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

       ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం , మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మీర్జాపేట సచివాలయం లోని   గొల్లపల్లి, రోలుగంపాడు గ్రామాలలో శనివారంనాడు ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా డాక్టర్. వంశీకృష్ణ ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు కోవిడ్ వ్యాక్సిన్ ను 18 సంవత్సరముల పై బడిన వారికి సుమారు 82 మందికి వ్యాక్సిన్ ను అందించడం జరిగింది. స్పెషల్ డ్రైవ్ లో పొలం పనులకు వెళ్లిన వారి దగ్గరకు వెళ్లి కోవిడ్ వ్యాక్సిన్ ను కూడా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎన్ ఎం - పి. వసంత కుమారి , హెల్త్ అసిస్టెంట్ - డి.వి. సత్యనారాయణ రావు , ASHA- మల్లీశ్వరి , AWW- విజయ కుమారి . పాల్గొనడం జరిగింది.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 



 

 అధికార మదంతో కేటీఅర్ వ్యాఖ్యలు

 టి.పి.సి.సి సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ 

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

కాంగ్రెస్ పార్టీ పై కె.టి.ఆర్ చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టి.పి.సి.సి సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ పేర్కొన్నారు. ఆయన అధికార మదంతో ఆయన కన్ను మిన్ను లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. శనివారంనాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి. 136 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు ఫ్రాంచైస్ గా మారి ఆయన బినామిలు, తొత్తులతో పార్టీని నడిపించటానికి దిక్కు తోచలేని పరిస్తితులలో ఏమీ లేదు. చరిత్ర తెలియని కె.టి.ఆర్ తాను ఆశిస్తున్న సి.ఎం పదవి దక్క కుండా పోతుందేమోననే దుగ్డతో మతి తప్పి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ భారత దేశానికి తానే దిక్కై సుధీర్ఘ పోరాటం చేసి స్వాతంత్య్రము సాధించిన పార్టీ అని మరువకూడదు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తముగా ప్రజా బలమున్న పార్టీ. ప్రజాస్వామ్యాన్ని పరి రక్షించగల్గే పార్టీ. బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు అభ్యున్నతికి పాటుపడే పార్టీ .

అన్ని మతాలను కులాలను సమానముగా ఆదరించి, గౌరవించే పార్టీ. దేశ సమైక్యత , సమగ్రతలే ప్రధాన ధ్యేయంగా గల పార్టీ.136 సంవత్సరాల చరిత్రగల్గి సుశిక్షితులైన నాయకులు, కార్యకర్తలు గల కాంగ్రెస్ పార్టీకి ఒకరి నామినీని దిగుమతి చేసుకుని భాద్యతలివ్వాల్సిన ఖర్మ పట్ట లేదు. కాంగ్రెస్ పార్టీ సిద్దాంతలపై విశ్వాసం ఉంచి పార్టీలో చేరి పని చేసే వారికి కూడా అవకాశాలు కల్పించబడుతాయి. కె.సి.ఆర్, చంద్రబాబులకు రాజకీయ జన్మనిచ్చినది కాంగ్రెస్ పార్టీయేనని మరువకూడదు. వి.హనుమంత రావు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు , కెసిఆర్ లు తనతో పాటు ఉపాధ్యక్షులు గా ఉన్న సంగతి కె.టి.ఆర్ కు తెల్సా? 1983 లో తప్పుడు పాస్ పోర్ట్ ల ఆరోపణలున్నందున అప్పటి అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గులాంనబీ ఆజాద్ కె.సి.ఆర్ ను పదవి నుండి తొలగిస్తే ఆ ఉత్తర్వులు ప్రెస్ కు ఒక రోజు వరకు ఇవ్వకుండా వి.ఎచ్ ను బ్రతిమాలుకుని, యూత్ కాంగ్రెస్ నుండి రాజీనామా చేసినట్ట్లు నటించి ఎన్.టి.ఆర్ ను కల్సి, అప్పుడే ఏర్పడ్డ టి.డి.పి. లో చేరిన మాట వాస్తవం కాదా? తన గురువైన మదన్ మోహన్ కు కెసిఆర్ పంగనామాలు పెట్టింది వాస్తవము కాదా? తెలంగాణా ఇచ్చిన సోనియమ్మ ను దేవత అని చెప్పి ఆ తదుపరి మోసము చేసినది కెసిఆర్ కాదా? తిన్న ఇంటి వాసాలు లెక్క పేట్టే నైజం కె.సి.అర్ కుటుంబానిది కాదా? చంద్రబాబు యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడై, ఆ తదుపరి టి.అంజయ్య క్యాబినెట్ లో మంత్రి అయినందుననే ఎన్ టి ఆర్ తన కూతురినిచ్చి పెళ్లి చేసింది వాస్తవము కాదా? 1983 ఎన్నికలలో కాంగ్రెస్ నుండి టి.డి పి పై పోటీ చేసిన చంద్రబాబు , ఎన్నికల తదుపరి మామ పంచన చేరి ఆ తదుపరి మామనే మోసము చేసినది వాస్టవము కాదా? ఉమ్మడి రాష్ట్రములో ఆ తదుపరి తెలంగాణా రాష్ట్రములో దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబు, కె.సి.ఆర్ లు ఇద్దరూ కారణము కాదా ? తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నాలు చేసిన చంద్రబాబును, రాష్ట్రము ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని దోచుకుంటున్న కెసిఆర్ ను తెలంగాణా ప్రజలు ఎన్నటికీ క్షమించరు. తమకు రాజకీయ జీవితము ప్రసాదించిన కాంగ్రెస్ ను నిలువెత్తు గోతి తీసి బొంద పెట్టాలన్న కెసిఆర్, చంద్రబాబు లలో ఒకరైన చంద్రబాబును ఇటు తెలంగాణా లో అటు ఆంధ్ర రాష్ట్రములో గోతి లో పడేసి పూడ్చుతున్నారు, ఇక రాబోయే కాలంలో తెలంగాణా లో కె.సి.ఆర్ కు ఆ గతి పట్ట బోతున్నారు. అని ఆయన విమర్శించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 నంద్యాల లో రైతు నగర్ లో ఉన్న వక్స్ బోర్డు  స్థలంలో,,,

ఉర్దూ జూనియర్ ,డిగ్రీ కాలేజీ, ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి 

 వామపక్ష మైనార్టీ సంఘాల డిమాండ్

దీక్షకు దిగిన జానోజాగో నేత  సయ్యద్ మహబూబ్ బాషా


(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

వక్స్ బోర్డు  స్థలంలో ఉర్దూ జూనియర్ ,డిగ్రీ కాలేజీ, ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరుతలూ కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో వామపక్ష మైనార్టీ సంఘాల  ఆధ్వర్యంలో మొదటి రోజు రిలే నిరాహార దీక్ష ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా చేపట్టారు. ఈ దీక్షలో ఆవాజ్ జిల్లా కన్వీనర్ మస్తాన్ వలి, జానో జాగో సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా, పిడిఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి రఫీ కూర్చున్నారు.  ఈ దీక్షలకు  ఆవాజ్ పట్టణ అధ్యక్షులు బాబుల్లా అధ్యక్షత వహించారు. ఈ దీక్షలను సిపిఎం తూర్పు జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ ప్రారంభించారు. ఇదిలా వుంటే ఈ దీక్షలకు ముస్లిం మైనార్టీ నాయకుడు అక్బర్ , ఐయూఎంఎల్ జిల్లా కార్యదర్శి సలాం మౌలానా, ఇన్సాఫ్ డివిజన్ నాయకులు షరీఫ్ భాషా, ఎంహెచ్ పిఎస్ రాష్ట్ర కార్యదర్శి యూనిస్, ఆవాజ్ యూత్ అధ్యక్షుడు సద్దాం,

 

సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సద్దాం హుస్సేన్, టిఎన్ టియూసీ నంద్యాల పార్లమెంటు సెక్రెటరీ సర్దార్, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ ఆసరా ఫౌండేషన్ బాబాఫక్రుద్దీన్, తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ మాట్లాడుతూ రైతు నగరం లో  ఖాళీగా  ఉన్న వక్ఫ్ బోర్డు  స్థలాల్లో ఉర్దూ జూనియర్, డిగ్రీ, ఉర్దూ యూనివర్సిటీ  లైబ్రరీ ల్యాబ్ రేటర్ నిర్మించి,  ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలి వారు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు .మరియుఖబర్ స్తాన్ ఈద్గా లను నిర్మించాలి. రాష్ట్ర వ్యాప్తంగా గా పెండింగ్ ఉన్న దులహన్ పథకం అమలుకు నిధులు వెంటనే మంజూరు చేయాలి వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభం

ఘనంగా లక్ష్మిదేవి వర్ధంతి

ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి,మాజీ ఎమ్మెల్యే జంకే తో పాటు పలువురు ప్రముఖులు హాజరు


(జానోజాగో వెబ్ న్యూస్-ప్రకాశం ప్రతినిధి)

కుటుంబ ప్రతిష్టను పెంపొందిస్తూ మరోవైపు గ్రామాభివృద్ధికి తుదిశ్వాస వరకు  పాటుపడిన స్వర్గీయ ఏలూరి లక్ష్మీదేవి దాన్యజీవని మార్కాపురం శాసన సభ్యులు కెపి నాగార్జునరెడ్డి అన్నారు.   దివంగత మహాన్విత స్వర్గీయ ఏలూరి లక్ష్మీదేవి  ప్రధమ వర్ధంతి కార్యక్రమం శనివారం గోబ్బురు గ్రామంలోని ఆమె స్వగృహంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి లక్ష్మిదేవి కుమారుడు, రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అధ్యక్షత వహించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి మాట్లాడుతూ వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో  ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ ను ఆమె భర్త గాలి వీరారెడ్డి  ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ బ్రోచర్ ను ఆవిష్కరించారు. పేదలకు విద్య, వైద్యం అందించాలనే లక్ష్యంతో ట్రస్ట్ ముందుకు వెళ్లాలని నిర్ణయించడం హర్షణీయమని అన్నారు.


ట్రస్ట్ చేపట్టబోయే  కార్యక్రమాలకు మా సహకారం ఎప్పుడు ఉంటుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ముందుగా స్వర్గీయ లక్ష్మీదేవి చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.


 

ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కుందురు క్రిష్ణ మోహన్ రెడ్డి, మార్కాపురం మున్సిపల్ చైర్మన్ ఛిర్లంచెర్ల బాల మురళీకృష్ణ, రాష్ట్ర వైసీపీ సెక్రటరీ, ఏ1 గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ యమ్ షంషీర్ అలీభేగ్, కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ అన్నా క్రిష్ణ చైతన్య, మార్కాపురం మున్సిపల్  వైస్ ఛైర్మన్ ఎస్ కె ఇస్మాయిల్, కౌన్సిలర్ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ,  మార్కాపురం నియోజకవర్గ  సిపిఐ కార్యదర్శి  అందే నాసరయ్య,మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ డీవి కృష్ణారెడ్డి, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి శాసనాల వీర బ్రహ్మం, రాక్ వెల్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ వెన్నా పోలిరెడ్డి,బత్తుల ఫౌండేషన్ చైర్మన్ బత్తుల నాగార్జున రెడ్డి, జిల్లా వైసీపీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి డి గాంధీరెడ్డి, వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి కంది ప్రమిలా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


 ఏపీ ప్రభుత్వ విభాగంలో ఉద్యోగాలు.. 

13 జిల్లాల్లో 70 ఉద్యోగ పోస్టులకు నోటిఫికేషన్‌


(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

ఏపీ ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ హెల్త్ మిషన్‌ డైరెక్టర్‌ కార్యాలయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లాలోని 14 టెలీ మెడిసిన్‌ హబ్స్‌లో కాంటాక్ట్‌ ప్రాతిపదికన 70 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈ-మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్‌ 6 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://hmfw.ap.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 70

పీడియాట్రీషియన్‌ – 14

గైనకాలజిస్ట్‌ – 14

మెడికల్‌ ఆఫీసర్లు – 28

జనరల్‌ ఫిజీషియన్‌ – 14


విద్యార్హత: పోస్టులను బట్టి ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. అలాగే ఎపీఎంసీలో రిజిస్టరై ఉండాలి.

వయసు: పోస్టులను బట్టి 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: స్పెషలిస్ట్‌ పోస్టులకు నెలకు రూ. లక్ష, మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు నెలకు రూ.53 వేలు చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈ-మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ-మెయిల్‌: spmuaprect@gmail.com

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్‌ 6, 2021

వెబ్‌సైట్‌: https://hmfw.ap.gov.in/

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


 

 అర్హులందరికీ పెన్షన్ ఇవ్వాలి

టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

        ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శనివారంనాడు మార్కాపురం నియోజక వర్గం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, మార్కాపురం నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీల వంకతో, కులాల వంకతో , తమ మద్దతు దారులనే నెపంతో కొంతమంది అర్హులైన పెన్షన్ దారులను తొలగిస్తూ అనర్హులను పెన్షన్ లో నమోదు చేస్తున్నారని మార్కాపురం ఎండిఓ కార్యాలయం ఎదుట మెరుపు ధర్నా నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఈ మెరుపు ధర్నాలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొని నిరసన తెలుపుతూ మార్కాపురం ఎండిఓ కార్యాలయములోని కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, సంబంధిత అధికారులు  పెన్షన్ల మంజూరులో అవినీతికి పాల్పడుతున్న అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని నినదించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాబోయే 15 రోజుల లోపు తక్షణమే ఎంక్వయిరీ చేసి అర్హులైన పెన్షన్ దారులకు పెన్షన్లు మంజూరు చేయాలని అనర్హులను తొలగించాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమములో పట్టణ మరియు నియోజక వర్గ ప్రాంత ప్రజలు,కార్యకర్తలు పాల్గొన్నారు.



 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి