మారాజు పాలనలో గూడులేని వారే ఉండరు

వైసీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

మారాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో గూడులేని వారే ఉండరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణ కార్యక్రమం యజ్ఞంలా సాగుతోందని.. ఒక రాష్ట్ర ప్రభుత్వం అక్షరాలా 31 లక్షల ఇళ్లను నిర్మించడం దేశ చరిత్రలోనే కాదు.. ప్రపంచ చరిత్రలోనూ మొదటిదని ఏలూరి స్పష్టం చేశారు. తొలిదశలోనే  15 లక్షల పైచిలుకు ఇళ్లని నిర్మించడం కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయమని చెప్పారు. మహానేత  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో 60 లక్షల ఇళ్ళు మంజూరు అయితే ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 40 లక్షల ఇళ్లు కట్టించారని రామచంద్రారెడ్డి గుర్తుచేశారు.. అప్పట్లో అదే గొప్ప రికార్డ్ అనుకుంటే.. ఇప్పుడు ఆయన కుమారుడు 30 లక్షలమందికి స్థలాలు ఇచ్చి.. ఇళ్ళు కూడా కట్టించడం అంతకంటే గొప్ప రికార్డుగా అభివర్ణిస్తున్నామని చెప్పారు. 

సొంతింట్లో ఉండాలనేది ప్రతి ఒక్కరి కల అని.. ఇది పెద్దోళ్లకు సుసాధ్యమైనా, పేదోళ్లకు మాత్రం కష్టసాధ్యంగా మారిన సమయంలో. సొంతింటి కల విషయంలో ఇక పేదోళ్లు దిగులు పడాల్సిన అవసరమే లేకుండా జననేత జగనన్న ప్రభుత్వం ఇళ్ళు కట్టిస్తోందని అన్నారు. మరోవైపు  పెద్ద ఎత్తున గృహ నిర్మాణాల ద్వారా సిమెంట్, ఇసుక, ఐరన్‌ వినియోగం పెరిగి ఎకానమీ వృద్ధి చెందుతుందని, మరోవైపు సొంతిళ్ల నిర్మాణం ద్వారా పేదలకు ఇంటివద్దే స్థానికంగా పనులు దొరుకుతాయన్నారు. అన్ని విధాలా పేదవాడి తలరాతను మారుస్తున్న జగనన్నకు కృతజ్ఞతలు అని రామచంద్రారెడ్డి అన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: