మండల వ్యవసాయ సహకార సంఘం
త్రిసభ్య కమిటీ చైర్మన్ గా కుందూరు సత్యనారాయణ రెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
మండల కేంద్రమైన తర్లుపాడు లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం త్రిసభ్య కమిటీ నూతన చైర్ పర్సన్ గా తర్లుపాడు మండలం లోని చెన్నా రెడ్డి పల్లె గ్రామానికి చెందిన కుందూరు సత్యనారాయణ రెడ్డిని మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు. నాగార్జున రెడ్డి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి అయినా వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటినుండి ప్రజా సంక్షేమం కోసం శ్రీకారం చుట్టారన్నారు. మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు. నాగార్జున రెడ్డి నాకు ఈ బాధ్యతను అప్పజెప్పడం జరిగిందని,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,వీరి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తమకున్న కొద్దిపాటి కాలంలో తన వంతు సొసైటీ బ్యాంక్ ద్వారా రైతు సమస్యలను తీర్చేందుకు తన వంతు తగిన కృషి చేస్తానని అన్నారు. తాను గుర్తించిన ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, తర్లుపాడు గ్రామ మాజీ సర్పంచ్ సూరెడ్డి రామసుబ్బారెడ్డి కి, వైసీపీ మండల స్థాయి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రిసభ్య కమిటీ పర్సన్ గాలి పెద్ద వెంకట్ రెడ్డి ( నాయుడు పల్లి ), రాచీటీ కాంతయ్య ( పోతల పాడు ), బ్యాంక్ మేనేజర్ టీ.కాశయ్య, సొసైటీ బ్యాంక్ సిబ్బంది, వైసిపి నాయకులు కుందూరు.వెంకటేశ్వర్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: