ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, సంస్థ పరిరక్షణ  కోసం నిరంతర పోరు

అదే ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ 

సీపీఐ నాయకులు కామ్రేడ్ అందే నాసరయ్య


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, సంస్థ పరిరక్షణ  కోసం నిరంతర పోరాడే యూనియన్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అని సీపీఐ నాయకులు కామ్రేడ్ అందే నాసరయ్య పేర్కొన్నారు. ఆదివారం ఉదయం పదిగంటలకు  మార్కాపురం డిపో యూనియన్ కార్యాలయం వద్ద యూనియన్ 70 వ వార్షికోత్సవం సందర్భంగా డిపో యూనియన్ గౌరవాధ్యక్షులు కామ్రేడ్ అందే నాసరయ్య గారు పతాకావిష్కరణ చేసి అనంతరం కేక్ కట్ చేసి యూనియన్ సభ్యులకుశుభాకాంక్షలు తెలియజేసినారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్టీసీలో 1952 లోనే ఏఐటీయూసీ అనుబంధంతో ఏర్పడిన యూనియన్ ఎంప్లాయిస్ యూనియన్ అని తెలిపినారు. కార్మికుల  పోరాటాల వెనక  ఏఐటీయూసీని భారత కమ్యూనిస్టు పార్టీ ఉండి నడిపించినదని,

 

  ఆర్టీసీ ఉద్యోగులు  కోరుతున్న సీపీఎస్ రద్దు, ఓల్డ్ పెన్షన్ కొరకు చేసే పోరాటాలకు మా మద్దతు పూర్తిగా ఉంటుందనితెలిపినారు. ఈ ఈ కార్యక్రమానికి డిపో కార్యనిర్వాహక అధ్యక్షులు సోమయాజుల శాస్త్రి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఎస్.కే. కాశీం, డిపో అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు, జనార్ధన రావు, గ్యారేజ్ కార్యదర్శి ఫ్రాన్సిస్,రెహమత్, పిచ్చిరెడ్డి, తాడి శ్రీను, ఎం.ఆర్.ఎస్. రెడ్డి, శేఖర్ నాయుడు, విశ్రాంత ఉద్యోగులు కేశవరావు, బండి శ్రీను, సుబ్బరాయుడు తో పాటుగా అత్యధిక మందిసభ్యులు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

              

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: