ఎల్.రమణ రాజీనామా వల్ల,,

 తెలుగుదేశం పార్టీకి ఎలాంటి నష్టం లేదు 

-నమ్మకద్రోహులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు 

-టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోసుకోండ వెంకటేష్

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

అందరూ ఊహించినట్టుగానే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  ఎల్.రమణ తెలుగుదేశం పార్టీని వీడబోతున్నారు అని అందుకు ఎవరు ఆశ్చర్య పడకూడదు. అది సెన్సేషనల్ న్యూస్ కాదు. అందరూ ఊహించిందే జరిగింది అని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగోసుకోండ వెంకటేష్ అన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రమణ పార్టీ మార్పు ముహూర్తం ఆలస్యంగానే ఖరారు అయిందని, రమణ పార్టీ మారడం వలన పార్టీకి పట్టుకున్న శని విరగడయిందని కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రమణ పార్టీ పెట్టిన బిక్షతో ఎదిగి సిగ్గులేకుండా పార్టీ మారడం కుట్ర కాదా ? మీరు టి.ఆర్.ఎస్ లోకి రండి తగిన గౌరవమిస్తాం అని కెసిఆర్ హామీ ఇవ్వగానే జబ్బలేగరేసుకుంటూ ప్రగతి భవన్ కు చేరిన రమణకు  ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ఇచ్చింది గౌరవం కాదా ?  పార్టీలోని సీనియర్లను పక్కన బెట్టి ఒక బి.సి సామాజిక వర్గానికి చెందిన రమణకు చంద్రబాబు ఇచ్చిన గౌరవాన్ని మరిచిపోతే పుట్టగతులుండవు. గత మూడు సంవత్సరాలుగా టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ వీడుతున్నట్టు అనేక సందర్భాలలో చర్చకు రావడం జరిగింది. ఎల్ రమణ పార్టీ వీడడం వలన తెలుగుదేశం పార్టీకీ తెలంగాణలో ఎలాంటి నష్టం లేదు. ఉమ్మడి జిల్లా నుండి రమణ వెంట ఎవరు వెళ్ళడం లేదు. తెలుగుదేశం పార్టీ ఇలాంటి నాయకులను ఎందరినో తయారుచేసింది. చివరకు అందరూ పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోవడం జరిగింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలహీనపడలేదు.  గ్రామస్థాయి నుండి చేదిరిపోని క్యాడర్ ఉంది. కొందరు నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం కావాలనే పార్టీని బలహీనం చేశారు. రమణ లాంటి పార్టీని వందమంది పార్టీని వదిలి వెళ్లినా వేలమంది సుశిక్షితులైన నాయకులు, కరుడుగట్టిన సైనికులు పార్టీని నడిపేందుకు సిధ్ధంగా ఉన్నారు. పార్టీలో ఉండి పదవులు అనుభవించి తరగని ఆస్తులు సంపాదించుకొని  తల్లిలాంటి పార్టీ రొమ్ము మీద గుధ్దిన ప్రతి ఒక్క నమ్మకద్రోహులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారనీ తెలిపారు ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: